Income Tax Department Recruitment : స్పోర్ట్స్ కోటాలో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో 73 ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోరతగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Income Tax Department Recruitment :
Income Tax Department Recruitment : కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 73 ట్యాక్స్ ఇన్స్ పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన స్పోర్ట్స్ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోరతగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత స్పోర్ట్స్ లో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పాల్గొని ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్పోర్ట్స్ లో సాధించిన ప్రతిభ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 20, 200 నుండి 34,800 వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఫిబ్రవరి 6, 2023 చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tnincometax.gov.in/sportsquota పరిశీలించగలరు.