AP 10th Class Results 2026 : పదో తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్ ఎప్పుడు.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP 10th Class Results 2026 : పదో తరగతి విద్యార్థులకి బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన వెలువడింది.

ap class 10 results 2026 will be release may first week how to check it

AP 10th Class Results 2026 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. సప్లీమెంటరీ పరీక్ష ఫీజు తేదీ కూడా వచ్చేసింది. ఈక్రమంలో పదో తరగతి విద్యార్థులు ఫలితాల విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న ముగిశాయి. ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యంకనం కూడా పూర్తయ్యింది. దీంతో ఫలితాల విడుదల కోసం విద్యార్థులు మాత్రమే కాక వారి తల్లిడండ్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పది ఫలితాలపై కీలక సమాచారం తెలిసింది.

దీని ప్రకారం.. మే మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను విడుదల చేసే అవకాశముంది అంటున్నారు. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లు తలెత్తకుండా చూసేందుకు గాను ప్రభుత్వం ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జవాబు పత్రాలు మూల్యాంకనం చేశాక మార్కులను కౌంట్ చేసి చేతితో నమోదు చేయడంతో పాటు ట్యాబ్‌లలో కూడా వెంటనే అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, అధికారులు వాటిని త్వరగా పరిష్కరించి ప్రక్రియను ముందుకు కొనసాగించారు.

ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మొత్తం హాజరు శాతం సుమారు 99.5 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతోంది. అన్నీ సవ్యంగా సాగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.

ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న పూర్తయ్యాయి. అక్కడ సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలంగాణలో కూడా మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూల్యాంకనం ఇప్పటికే పూర్తయినందున, ఫలితాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించవచ్చు. అదేవిధంగా 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.