Inter Board AP: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల.. ఆఖరి తేదీ, పరీక్షల వివరాలు!
2027 ఇంటర్మీడియట్ (Inter Board AP)పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
- V Santhosh Kumar
- Published on- September 23, 2026 / 07:08 PM IST
AP Inter Board released fee notification for 2027 Intermediate public examinations.
Inter Board AP: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. 2027లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆయా కళాశాలల ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా సాధారణ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ఆలస్య రుసుము వివరాలు, పరీక్షల షెడ్యూల్:
సాధారణ గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు బోర్డు మరొక అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కాగా, 2027 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్(Inter Board AP) పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 23న ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.
ప్రాక్టికల్ పరీక్షల సమయాలు, మార్పుల అవకాశం:
పబ్లిక్ పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటాయి. అయితే, పరిస్థితులకు అనుగుణంగా ఈ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.
