AP Inter Supplementary Exams 2026: ఏపీ సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీలు విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదిగో

AP Inter Supplementary Dates 2026 : ఆంధ్రప్రదేశ్ సప్లీమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది.

ap intermediate supplementary exams 2026 dates and full schedule

AP Inter Supplementary 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చినట్లు అనుమానం ఉన్న వారు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేలా బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది. ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు మార్కులు పెంచుకోవాలనుకునే (Improvement) వారికి కూడా ఇది మంచి అవకాశం.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ – 2026

  • థియరీ పరీక్షలు: మే 21, 2026 నుండి జూన్ 4, 2026 వరకు.
  • ప్రాక్టికల్ పరీక్షలు: జూన్ 7 నుండి జూన్ 11, 2026 వరకు నిర్వహించనున్నారు.

పరీక్ష సమయాలు:

  • మొదటి సంవత్సరం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
  • రెండవ సంవత్సరం: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.

ఇతర పరీక్షలు:

  • ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్: జూన్ 5.
  • ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్: జూన్ 6.

అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ కాలేజీల్లో నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజు చెల్లింపు గడువు

తేదీలు: ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు.

రీకౌంటింగ్ (RC), రీవెరిఫికేషన్ (RV) వివరాలు:

ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దరఖాస్తు గడువు: ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు.
  • రీకౌంటింగ్ (RC): మార్కులు సరిగ్గా లెక్కించారో లేదో తెలుసుకోవడానికి దీనిని ఎంచుకోవచ్చు.
  • రీవెరిఫికేషన్ (RV): ఇందులో జవాబు పత్రాల స్కాన్ కాపీని విద్యార్థికి పంపిస్తారు.

ఎగ్జామ్ పేపర్లు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు పైన పేర్కొన్న తేదీల్లోగా తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించుకోవాలి. మొత్తం పేపర్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు.