SSC Board Additional Marks : పదో తరగతి విద్యార్థులకు శుభవార్త… అదనంగా 7 మార్కులు…

SSC Board Additional Marks : పదో తరగతి విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. అదనంగా 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకరించింది.

ap ssc board additional marks to 10th students 2026 for ambiguous questions in hindi and english exam papers

  • ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
  • అదనంగా 7 మార్కులు
  • ప్రకటించిన ఎస్ఎస్సీ బోర్డు

SSC Board Additional Marks : పదో తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. ఎస్ఎస్‌సీ (SSC) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో వచ్చిన సందిగ్ధ ప్రశ్నలపై బిగ్ అప్‌డేట్ వెల్లడించింది. ఈ ప్రశ్నలకు అదనంగా మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయంతో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అదనంగా 7 మార్కులు కలవనున్నాయి. అయితే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సంవత్సరం ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ మార్కులు కలుస్తాయి. ఈ మేరకు ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు.. ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను డీఈవోలకే (DEO) పంపించారు.

ఎస్ఎస్‌సీ బోర్డు ఆదేశాల ప్రకారం.. ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు హిందీ పరీక్షలో 2 మార్కులు.. అలాగే ఇంగ్లీష్ పరీక్షలో 5 మార్కులు అదనంగా కలవనున్నాయి. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు ఈ మార్కులను కలపనున్నారు. ఈ సంవత్సరం పదో తరగతి బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్, హిందీ పరీక్ష పేపర్లలో మొత్తం 3 ప్రశ్నలు అస్పష్టంగా వచ్చాయి. వీటి వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాసిన విద్యార్థులకు ఈ మార్కులు ఇవ్వనున్నారు. పదో తరగతి హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాల్లో కొన్ని ప్రశ్నల్లో పొరపాట్లు లేదా అస్పష్టత ఉన్నట్లు బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

అయితే మరో 3 ప్రశ్నలపై కూడా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటికి కూడా మార్కులు అదనంగా కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ బోర్డు మాత్రం ఆ ప్రశ్నల్లో ఎలాంటి పొరపాట్లు లేవని స్పష్టం చేసింది. అదనపు మార్కులు కలుపుతూ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల మార్కులు పెరుగుతాయి, గ్రేడ్ మెరుగవుతుంది.. ఇది విద్యార్థులు పాస్ అవ్వడంలో కూడా ఎంతగానో సహాయపడనుంది.