Inter Classes Start 2026 : విద్యార్థులకు అలర్ట్.. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం.. ఎవరికంటే..!

Inter Classes Start 2026 : విద్యార్థులకు కీలక అలర్ట్.. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం కానున్నాయి.

In andhra pradesh telangana Intermediate classes to begin from 2026 June 1

  • ఏపీ, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
  • మే 31తో ముగియనున్న సెలవులు
  • జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభం

Inter Classes Start 2026 : రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సెలవులు ముగియబోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూన్ 1 నుంచే తరగతులు మొదలు కాబోతున్నాయి. అదేంటి జూన్ 12 నుంచి కదా అంటే స్కూల్ పిల్లలకు కాదు.. ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. మే 31 అంటే మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ముగియబోతున్నాయి. జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యార్థులకు కాలేజీలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ బోర్డులు కొత్త విద్యా సంవత్సర క్యాలెండర్లను విడుదల చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ కాలేజీలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

కాగా ఏపీలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ (NCERT) సిలబస్‌ సీబీఎస్‌ఈ (CBSE) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పాటు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్ ని తాజాగా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 232 రోజులు పని చేయనున్నాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను గతంలోనే విడుదల చేసింది. మార్చి 30న ఈ అకడమిక్ క్యాలెండర్‌ ని విడుదల చేసింది. దీని ప్రకారం ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు తరగతులు జూన్‌ నెల ఆరంభం నుంచే ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణలో 224 పని దినాలు ఉండనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ముమ్మరంగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ 11వ తేదీతో వేసవి సెలవులు ముగియనున్నాయి. ఆ తర్వాత రోజు నుంచి, అంటే జూన్‌ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు తెరుచుకోనున్నాయి. జూన్ 12 నుంచి విద్యార్థులు బడి బాట పట్టనున్నారు.