Canara Bank Recruitment : కెనరా బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం, ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : August 28, 2022 / 01:05 PM IST
Canara Bank Job Vacancy
Canara Bank Recruitment : ముంబయిలోని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్పెషల్, జనలర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లో ఖాళీలు డిప్యూటీ మేనేజర్(కంపెనీ సెక్రటరీ) 1ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ కంప్లయన్స్, ఇనిస్టిట్యూషనల్ డీలర్, సర్వైలెన్స్) 3 ఖాళీలు, జూనియర్ ఆఫీసర్ (కేవైసీ, బ్యాక్ ఆఫీస్- సెటిల్మెంట్, రిటైల్ డీలర్) 4ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్- ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ 1 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో భాగంగా జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ బ్యాక్ ఆఫీస్ 2ఖాళీలు, జూనియర్ ఆఫీసర్ కేవైసీ/ రిటైల్/ బ్యాక్ ఆఫీస్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం, ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ముంబై, బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, నారిమన్ పాయింట్, ముంబయి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు 5 సెప్టెంబర్2022 తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://canarabank.com/పరిశీలించగలరు.
