CBSE Class 10 Result 2026 : విద్యార్థులకి అలర్ట్.. పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకొండి

CBSE Class 10 Result 2026 : సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకి అలర్ట్... ఫలితాలు వచ్చేశాయి.

CBSE Class 10 Result 2026 Announced students can check their results through official website and digilocker links

CBSE Class 10 Result 2026 : ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే నేడే అంటే ఏప్రిల్ 15, బుధవారం నాడే పదో తరగతి ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే నేడు విడుదలయ్యింది సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. ఏప్రిల్ 15 బుధవారం నాడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లేదా results.cbse.nic.in లేదా cbse.nic.in ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు.

వీటితోపాటు డిజిలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా కూడా పదో తరగతి విద్యార్థులు తమ రిజల్ట్ ని చూసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలని విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 43 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వీరిలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 25 లక్షల మంది కాగా.. మిగతా వారు ఇంటర్ విద్యార్థులు. ఇదిలా ఉంటే గత సంవత్సరం.. 10వ, 12వ తరగతి ఫలితాలు రెండూ ఒకేసారి మే 13న ప్రకటించారు. విద్యార్థులు గరిష్టంగా మూడు సబ్జెక్టులలో తమ స్కోర్‌లను మెరుగుపరుచుకునేందుకు వీలుగా సీబీఎస్ఈ ఈ ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసే విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ సంవత్సరం నుంచి.. 10వ తరగతిలో 1, 2 మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే విధానం తీసుకువచ్చారు. అయితే ఈ గ్రేస్ మార్కులు కలపాలంటే.. సదరు విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి గాను మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు పొందాలి. అప్పుడే వీటిని కలుపుతారు. 12వ తరగతి పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.