PM Vidyalaxmi Scheme : విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.16 లక్షలు జమ.. పూర్తి వివరాలు…

PM Vidyalaxmi Scheme : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు రూ.16 లక్షల పొందే అవకాశం కల్పిస్తోంది.

central government offers education loans up to rs 16 lakh pm vidyalaxmi scheme higher studies details here

PM Vidyalaxmi Scheme : ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదవాలని.. పేదరికం వారికి అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 16 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. అదే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి (PM-Vidyalaxmi) పథకం. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా హామీ లేని విద్యా రుణాలను అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్య విభాగం దీన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద, అర్హత కలిగిన సంస్థలలో ప్రవేశం పొందిన విద్యార్థులు రూ. 16 లక్షల వరకు సులభంగా, పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారానే లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే సదరు విద్యార్థి భారతదేశంలోని గుర్తింపు పొందిన 860 నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థలలో (QHEIs) మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందాలి. ఈ పథకం అమలు కోసం.. ఉన్నత విద్య విభాగం, కెనరా బ్యాంక్‌ను నోడల్ బ్యాంక్‌గా ఎంచుకుని అమలు చేస్తోంది.

అర్హత (Eligibility)

విద్యార్థుల కోసం:

  • భారతీయ పౌరుడై ఉండాలి.
  • గుర్తింపు పొందిన 860 QHEIsలో మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందాలి.
  • మేనేజ్‌మెంట్ కోటా, ఇతర ప్రత్యేక కోటాల ద్వారా అడ్మిషన్ పొందకూడదు.
  • కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8 లక్షల లోపు ఉంటే 3 శాతం వడ్డీ సబ్సిడీ వర్తిస్తుంది.
  • ఇతర కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్, వడ్డీ సబ్సిడీ పథకాలు పొందకూడదు.
  • కోర్సును మధ్యలో వదిలేయకూడదు. క్రమశిక్షణా చర్యలతో మధ్యలో తొలగించకూడదు.
  • రెండో సంవత్సరం నుంచి వడ్డీ సబ్సిడీ పొందాలంటే చదువులో మెరుగైన ప్రతిభ కనబర్చాలి.
  • ఈ పథకం UG/PG/ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏదైనా ఒక దానికి మాత్రమే పొందే అవకాశం కల్పిస్తోంది.

విద్యాసంస్థల కోసం (QHEIs):

  • NIRF తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఉన్న విద్యాసంస్థలు ఈ పథకానికి అర్హులవుతాయి.
  • రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని టాప్ 200 విద్యాసంస్థలు.
  • కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మిగతా విద్యాసంస్థలు.
  • విదేశీ విద్యాసంస్థలు, వాటి క్యాంపస్‌లు ఈ పథకంలో ఉండవు.

దరఖాస్తు విధానం (Application Process)

ముందుగా సదరు విద్యార్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:

  • ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • “Login” > “Student Login” > “Create an Account” క్లిక్ చేయండి.
  • విద్యార్థి ఆధార్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
  • స్టూడెంట్ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి.
  • ఆ తర్వాత OTPతో ధృవీకరించాలి.
  • పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
  • వివరాలు నమోదు చేసిన తర్వాత “Submit” బటన్ మీద క్లిక్ చేయాలి.

అప్లికేషన్ ప్రాసెస్:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
  • అనంతరం User ID (ఇమెయిల్), పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
  • OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
  • ఆపై “Apply for Education Loan” పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలు నమోదు చేసి.. అడిగిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  • బ్యాంక్, బ్రాంచ్ ని సెలక్ట్ చేసుకోవాలి.
  • వివరాలు చెక్ చేసి “Final Submit” ఎంటర్ చేయాలి.

అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • అడ్రస్ ప్రూఫ్
  • గత విద్యా మార్కుల మెమోలు (Self-attested)
  • ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితం
  • అడ్మిషన్ ఆఫర్ లెటర్, ఫీజు వివరాలు
  • ఆదాయ ధృవీకరణ పత్రం