Coal India Recruitment : కోల్ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : September 20, 2022 / 07:35 PM IST
Coal India Ltd
Coal India Recruitment : కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం108 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి అండ్ ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) 39ఖాళీలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) 68 ఖాళీలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ – డెంటల్ (E3) 1ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్ 29లోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.coalindia.in/ పరిశీలించగలరు.
