CUET Exam 2023 : ప్రభుత్వ, ప్రవేటు యూనివర్శిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ లలో ప్రవేశాలకు కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్!

దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు/ చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా పూర్తిచేసినవారు, హయ్యర్‌ సెకండరీ సర్టిఫికెట్‌ ఒకేషనల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులే.

Common University Entrance Test Notification for Admissions in Undergraduate Programs in Government and Private Universities!

CUET Exam 2023 : దేశవ్యాప్తం గా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలతో సహా డీమ్డ్‌ యూనివర్సిటీలు ,అటానమస్‌ కళాశాలలు, ప్రభుత్వ/ ప్రైవేట్‌ యూనివర్సిటీలు, పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీలు, అందిస్తున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ లలో ప్రవేశాలకుగాను కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించనుంది.

దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు/ చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా పూర్తిచేసినవారు, హయ్యర్‌ సెకండరీ సర్టిఫికెట్‌ ఒకేషనల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులైనవారు, జనరల్‌ సర్టిఫికెట్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామినేషన్‌ అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌ పూర్తిచేసినవారు, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి హైస్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు ఈ ఎట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు

హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. అభ్యర్థులు కనిష్ఠంగా మూడు, గరిష్ఠంగా పది సబ్జెక్టులలో పరీక్ష రాసే వీలుంది. సింగిల్‌ విండో విధానం ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 12, 2023గా నిర్ణయించారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మార్చి 15 నుంచి 18 వరకు అనుమతిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cuet.samarth.ac.in/ పరిశీలించగలరు.