Dasara Holidays 2026 : విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు వచ్చేశాయ్! తెలంగాణలో 13 రోజులు.. ఏపీలో 10 రోజులు..!

Dasara Holidays 2026 : ఏపీ, తెలంగాణ విద్యార్థులకు పండగే.. దసరా సెలవులు వచ్చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published on- September 20, 2026 / 07:12 PM IST

Dasara Holidays 2026

  • ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్
  • దసరా సెలవులపై ప్రభుత్వాల కీలక ప్రకటన
  • బతుకమ్మ, దసరా వేడుకలకు భారీ సెలవులు..
  • దసరా సెలవుల స్కూల్ హాలిడేస్ లిస్ట్ ఇదే

Dasara Holidays 2026 : దసరా పండుగ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు దసరా సెలవులపై క్లారిటీ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలవుల తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే తమ ప్రయాణాలు, పండుగ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు.

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు మొత్తం 13 రోజుల పాటు రానున్నాయి. బతుకమ్మ, దసరా పండుగలు వరుసగా రావడంతో విద్యార్థులకు లాంగ్ బ్రేక్ లభించనుంది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 9 లాస్ట్ వర్కింగ్ డే ఉండగా, సెలవుల అనంతరం అక్టోబర్ 23 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి.

ఏపీలో 10 రోజులు సెలవులు :
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం 2026-27 క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే, క్రైస్తవ, మైనార్టీ విద్యాసంస్థలకు సెలవుల విషయంలో కొంత మార్పు ఉండొచ్చని సమాచారం.

Read Also : AP Residence Certificate : ఆధార్, రేషన్ కార్డు సరిపోతుందా? రెసిడెన్స్ సర్టిఫికెట్‌ ఎవరికి అవసరం? ఫుల్ డిటెయిల్స్

తెలంగాణలో 13 రోజులు :
ఇక తెలంగాణలో దసరా సెలవులకు ముందే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాథమిక తరగతులకు అక్టోబర్ 5 నుంచి 9 వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు అక్టోబర్ 1 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 20న దసరా పండుగ రానుంది. బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. దీంతో తెలంగాణలో పండుగ వాతావరణం మరింత సందడిగా మారనుంది. దసరా సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలలకు హాజరవుతారు.