జియో ఫోన్ వాడుతున్నారా? అయితే మీ జియో ఫోన్ల కోసం DIKSHA APP వచ్చేసింది.. ప్రత్యేకించి జియో ఫోన్ యూజర్ల కోసం ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. DIKSHA యాప్ అనేది ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫాం.. భారత ప్రభుత్వం ఈ యాప్ ఆవిష్కరించింది. ఇందులో టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం లెర్నింగ్ మెటేరియల్స్ అఫర్ చేస్తోంది.
స్కూళ్లలో ఈ-లెర్నింగ్ విధానాన్ని కొనసాగించేలా ప్రోత్సహిస్తోంది. DIKSHA ప్లాట్ ఫాం ద్వారా డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సాయంతో పాఠ్య ప్రణాళికలు, వర్క్ షీట్లు, ఇతర క్లాస్ రూం అనుభవాలను టీచర్లు, విద్యార్థులకు అందించనుంది. ఈ కొత్త DIKSH ప్లాట్ ఫాం అందరికి అందుబాటులో లేదు..
https://10tv.in/internet-speed-record-shattered-at-178-terabits-per-second/
స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లు లేదా కంప్యూటర్ల ద్వారా యాక్సస్ చేసుకోలేరు.. దేశంలో అత్యంత పాపులర్ ఫీచర్ ఫోన్లలో ఒకటైన జియో ఫోన్‌లో మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. జియో ఫోన్లలో సాధారణ KaiOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.. ఈ లెర్నింగ్ ప్రొగ్రామ్‌కు సపోర్ట్ చేసేలా ఉంది.
జియో ఫోన్లో DIKSHA App డౌన్ లోడ్ చేయాలంటే? :
జియో ఫోన్లలో KaiOS ప్లాట్ ఫాంపై రన్ అవుతున్నాయి. ఈ డివైజ్‌ల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే యాప్స్ యాక్సస్ చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా Whatsapp, Facebook, Youtube వంటి యాప్స్ సపోర్ట్ చేస్తాయి. DIKSHA యాప్ ను కూడా జియో ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోలేరు.. దీనికి చాలా పరిమితులు ఉంటాయి. యాప్ సైజుపై ఆధారపడి ఉంటుంది.. అంటే దీనిర్థం.. మీరు జియో ఫోన్‌లో DIKSHA ప్లాట్ ఫాం యాక్సస్ చేసుకోలేరని కాదు..
DIKSHA App యాక్సస్ ఎలా? :
జియో ఫోన్లో DIKSHA యాప్ డౌన్ లోడ్ చేసుకోలేరు.. కానీ, యాప్ ను మీరు సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.. అదేలాగో చూద్దాం..
1. మీ జియో ఫోన్లో Browser ఓపెన్ చేయండి.. DIKSHA కోసం సెర్చ్ బార్‌లో సెర్చ్ చేయండి.
2. మీకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి.. అందులో అధికారిక వెబ్ సైట్ diskha.gov.in లింకుపై క్లిక్ చేయండి.
3. జియో ఫోన్లో చిన్న స్క్రీన్ చూడటం కష్టంగా ఉండొచ్చు.. అప్పుడు మీరు వెబ్ సైట్లో మొబైల్ వ్యూ (mobile View)లోకి Switch అవ్వండి.
4. మీకు అవసరమైన Syllabus కోసం సెర్చ్ చేయండి.. NCERT, CBSE, లేదా the State/UT ఆప్షన్లలో మీరు క్లాసులను ప్రారంభించవచ్చు.