Group 3 Results: గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్స్ట్ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
2024లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది. మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు.
Group 3 Results: గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 1370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తన అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.tgpsc.gov.in) అందుబాటులో ఉంచింది. ఇటీవలే సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్.. వెరిఫికేషన్ కోసం పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది.
2024లో నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది. 5లక్షల 36వేల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం (సుమారు 2.5 లక్షలు) మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించారు. 1370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఎల్‌డి స్టెనో తదితర పోస్టుల భర్తీ చేయనున్నారు.
Also Read: మీ కారు మైలేజీ తగ్గిందా? అందరూ చేసే 5 మిస్టేక్స్ ఇవే.. ఇలా చేస్తే మీ ప్రతి పైసా సేవ్ అయినట్టే..!
