Contract Vacancies : తూర్పు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌, యూపీహెచ్‌సీ లో ఒప్పంద ఖాళీల భర్తీ!

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదోతరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

Establishment of East Godavari YSR Urban Clinic, filling contract vacancies in UPHC!

Contract Vacancies : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌, యూపీహెచ్‌సీ ఆసుపత్రుల్లో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4, ఫార్మసిస్ట్ పోస్టులు 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు 7 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదోతరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధులు నవంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ నవంబర్‌ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఫైనల్ మెరిట్‌లిసస్టు డిసెంబర్‌ 5వ తేదీన విడుదల చేస్తారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (డా. వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ క్లినిక్ /యుపిహెచ్), తూర్పు గోదావరి జిల్లా, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eastgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.