Filling up of job vacancies in technical departments in government institutions
CSIR Recruitment : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్ధ ప్రభుత్వ సంస్థల్లో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ III టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఫుల్ టైమ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. లేదా సంబంధిత ఫీల్డ్/ఏరియాలో రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థికి వయోపరిమితి 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.
స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ తర్వాత రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షలో అభ్యర్థి పనితీరు ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు పే స్కేల్ రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను పంపేందుకు జనవరి 17, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ recruitment.csir.res.in పరిశీలించగలరు.