NHCP Recruitment: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నెలకు లక్ష జీతం.. NHCPలో జాబ్స్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

హరియాణ, ఫరిధాబాద్‌లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్(NHCP Recruitment) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా

NHCP Recruitment: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నెలకు లక్ష జీతం.. NHCPలో జాబ్స్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

NHCP Recruitment: national hydro electric power corporation has released a job notification

Updated On : August 27, 2025 / 11:08 AM IST

NHCP Recruitment: రాత పరీక్షా లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ అందించనున్నారు. ఈమేరకు హరియాణ, ఫరిధాబాద్‌లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHCP Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్), మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 8వ తేదీతో ముగియనుంది. కాబట్టి, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.nhpcindia.com/welcome/job ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ కీలక అప్డేట్.. సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఇదే

ఖాళీలు, పోస్టుల వివరాలు:

  • ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు 06
  • ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు 02
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు 01

విద్యార్హత:
అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో తప్పకుండా ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేశానే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకుండదు

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000 జీతం అందుతుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టుల కోసం అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.