Group 1 Petitions: గ్రూప్ ‌1 పిటిషన్లు.. రేపే హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..

పారదర్శకంగా మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గ్రూప్ 1 పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Group 1 Petitions: గ్రూప్ ‌1 పిటిషన్లు.. రేపే హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..

Updated On : September 8, 2025 / 10:38 PM IST

Group 1 Petitions: గ్రూప్ ‌1 పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారు మూల్యాంకనాన్ని కోర్టులో సవాల్‌ చేశారు. మెయిన్స్‌ జవాబు పత్రాలు పున:మూల్యాంకనం చేయాలని పిటిషన్లలో కోరారు. లేదా మెయిన్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.

ఈ పిటిషన్లపై ఇప్పటికే ఏప్రిల్‌లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా గ్రూప్ ‌1 నియామకాలపై స్టే విధించింది హైకోర్టు. నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఇంప్లీడ్‌ పిటీషన్ దాఖలు చేశారు గ్రూప్ ‌1కు ఎంపికైన అభ్యర్థులు. గ్రూప్‌1కు ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటీషన్లు వేశారని టీజీపీఎస్సీ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

పారదర్శకంగా మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించనుంది. గ్రూప్ 1 పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అని అభ్యర్థుల్లో ఆసక్తి ఏర్పడింది.

Also Read: రైల్వేలో 32వేల పోస్టులు.. అభ్యర్థులకు బిగ్ అప్ డేట్.. ఎగ్జామ్ డేట్ ఇదే.. పరీక్ష విధానం పూర్తి వివరాలు..