RRB Group D Exam Date: రైల్వేలో 32వేల పోస్టులు.. అభ్యర్థులకు బిగ్ అప్ డేట్.. ఎగ్జామ్ డేట్ ఇదే.. పరీక్ష విధానం పూర్తి వివరాలు..

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రైల్వే పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది.. ఏంటా అప్ డేట్.. తెలుసుకుందాం..

RRB Group D Exam Date: రైల్వేలో 32వేల పోస్టులు.. అభ్యర్థులకు బిగ్ అప్ డేట్.. ఎగ్జామ్ డేట్ ఇదే.. పరీక్ష విధానం పూర్తి వివరాలు..

Updated On : September 8, 2025 / 9:34 PM IST

RRB Group D Exam Date: రైల్వేలో 32వేల 438 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వివిధ విభాగాల్లో 32వేల 438 లెవల్-1 పోస్టుల భర్తీకి CEN 08/2024 కింద RRB గ్రూప్ D పరీక్ష 2025ను నిర్వహిస్తుంది. ఇందులో పలు డిపార్ట్ మెంట్స్ లో పోస్టులు భర్తీ చేయనున్నారు. మెయింటెయినర్, పాయింట్స్‌మన్, లోకో షెడ్‌, ఆపరేషన్స్, ట్రాక్షన్ అండ్ లగేజ్ (TL), ఎయిర్-కండిషనింగ్ (AC) విభాగాలలో అసిస్టెంట్లు వంటి పోస్టులు ఉన్నాయి.

నియామక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్షతో ప్రారంభమవుతుంది. నవంబర్ 17 నుండి డిసెంబర్ 2025 నెలాఖరు వరకు తాత్కాలికంగా షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటాయి.

పరీక్షకు కొన్ని రోజుల ముందు అభ్యర్థులు తమ ఎగ్జామ్ సెంటర్ సమాచారం, అడ్మిట్ కార్డులను అందుకుంటారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

RRB గ్రూప్ D కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ లో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వంటి 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం వ్యవధి 90 నిమిషాలు. స్క్రైబ్‌ను ఉపయోగించే వైకల్యం ఉన్న అభ్యర్థులకు 120 నిమిషాలు సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కులలో మూడింట ఒక వంతు నెగటివ్ మార్కింగ్‌గా ఉంటుంది.

జనరల్ అవేర్ నెస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ – 20 ప్రశ్నలు, 20 మార్కులు
రీజనింగ్ – 30 ప్రశ్నలు, 30 మార్కులు
మ్యాథ్స్ – 25 ప్రశ్నలు, 25 మార్కులు
జనరల్ సైన్స్ – 25 ప్రశ్నలు, 25 మార్కులు

* మొత్తం పోస్టులు – 32,438
* నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఎగ్జామ్స్
* కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

Also Read: ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు: నెలకు రూ.50 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు