Apmsrb Recruitment: ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు: నెలకు రూ.50 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

ఆంద్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం(Apmsrb Recruitment) 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

Apmsrb Recruitment: ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు: నెలకు రూ.50 వేల జీతం.. దరఖాస్తు, పూర్తి వివరాలు

apmsrb recruitment notification for 48 deputy executive officer posts

Updated On : September 7, 2025 / 5:36 PM IST

Apmsrb Recruitment: ఆంద్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలవగా(Apmsrb Recruitment) సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనుంది. కాబట్టి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Bamboo Salt: ప్రపంచంలోనే ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కేజీ రూ.35000.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

విద్యార్హత:
అభ్యర్థులు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే పని చేసిన అనుభవం కూడా ఉండాలి, ఏపీ మెడికల్ కౌన్సెలిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వాటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అభ్యర్థులు చదువులో కనబరిచిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వాస్పత్రిలో సర్వీస్ చేసిన అభ్యర్తలకు వెయిటేజీ పాయింట్స్ ఇస్తారు.

దరఖాస్తు రుసుము:
ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,350 జీతం ఇస్తారు.