RTC Jobs: ఆర్టీసీలో ఉద్యోగాలు.. జీతం 60వేలు.. మొత్తం పోస్టులు, వయసు, విద్యార్హత పూర్తి వివరాలు..
ఆర్టీసీలో ఏయే పోస్టులు పడ్డాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

RTC Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్టీసీలో ఉద్యోగాలు పడ్డాయి. డ్రైవర్లు, శ్రామిక్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ పోస్టులు 1000 ఉన్నాయి. 743 శ్రామిక్ (మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్) పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 28. పూర్తి వివరాల కోసం www.tgprb.inలో చూడాలని పోలీసు నియామక మండలి తెలిపింది.
ఫీజు..
డ్రైవర్ పోస్టుకు – 600 రూపాయలు
ఎస్టీ, ఎస్టీ, లోకల్స్ కు – 300 రూపాయలు
శ్రామిస్ పోస్టుకు – 400 రూపాయలు
ఎస్సీ, ఎస్టీ, లోకల్స్ కు – 200 రూపాయలు
జీతం..
డ్రైవర్ పోస్టుకు – రూ.20,960 – రూ.60,080
శ్రామిక్ పోస్టుకు – రూ.16,500 – రూ.45,030
పోస్ట్ కోడ్..
డ్రైవర్ – 45
శ్రామిక్ – 46
మొత్తం పోస్టులు..
డ్రైవర్ – 1000
శ్రామిక్ – 743
* ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి..
* అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు.
* అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5గంటలతో దరఖాస్తు గడువు ముగుస్తుంది.
* TSLPRB వెబ్ సైట్ www.tgprb.in లో అప్లయ్ చేసుకోవాలి.
డ్రైవర్ పోస్టులు..
* పురుషులు, మహిళలు అర్హులు.
* వయసు – 22 నుంచి 35 ఏళ్లలోపు (జూలై 1, 2025 నాటికి) ఉండాలి.
* టెన్త్ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి.
* వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
శ్రామిక్ పోస్టులు..
* వయసు – జూలై 1 2025 నాటికి.. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి..
* ఐటీఐ(మెకానికల్- డీజిల్/మోటర్ వెహికల్) పాస్ అయ్యి ఉండాలి.