Oscar 2026: ఆస్కార్ 2026 రేసులో 5 తెలుగు సినిమాలు.. కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం.. ఇంకా..
ఆస్కార్ 2026(Oscar 2026) కోసం ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) చేసింది.

India's selection for Oscar 2026, Kannappa and sankranthiki vasthunnam films
Oscar 2026: ఆస్కార్ 2026 కోసం ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) చేసింది. బాలీవుడ్ నుంచి నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైంది. ఈ సినిమా(Oscar 2026) సెప్టెంబర్ 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా పలు పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన విషయం తెలిసిందే.
Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లీక్.. సూపర్ హీరో లుక్ నెక్స్ట్ లెవల్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇక తెలుగు నుంచి ఆస్కార్ 2026 కోసం పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేరా వంటి సినిమాలు పోటీ పడబోతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా తుది జాబితాలో చోటు దక్కించుకుంటుందో చూడాలి.