Yashasvi Jaiswal : ఎట్టకేలకు మౌనం వీడిన యశస్వి జైస్వాల్.. ఆసియాకప్ 2025లో చోటు దక్కకపోవడంపై..
ఆసియాకప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత బృందంలో తనకు చోటు దక్కకపోవడంపై యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఎట్టకేలకు స్పందించాడు.

Yashasvi breaks silence on being snubbed from India squad for Asia Cup 2025
Yashasvi Jaiswal : ఆసియాకప్ 2025లో భారత్ అదరగొడుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్-4కి దూసుకువెళ్లింది. కాగా.. ఈ మెగాటోర్నీకి ఎంపికైన 15 మంది సభ్యులు గల బృందంలో టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కు చోటు దక్కలేదు. ఇన్నాళ్లు ఈ విషయం పై మౌనంగా ఉన్న యశస్వి.. ఎట్టకేలకు స్పందించాడు.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ ప్రాతినిధ్యం వహించాడు. 14 మ్యాచ్‌ల్లో 559 పరుగులు సాధించాడు. అటు ఇంగ్లాండ్ పై ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. అయినప్పటికి కూడా జైస్వాల్‌కు ఆసియాకప్‌లో చోటు దక్కకపోవడం ఎంతో మంది ఆశ్చర్యపరిచింది.
India vs Oman : సంజూ శాంసన్ తప్పించుకున్నాడు.. హార్దిక్ బలి అయ్యాడు.. వీడియో వైరల్..
దీనిపై జైస్వాల్ స్పందిస్తూ.. దాని గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. అది సెలక్టర్ల చేతుల్లో ఉంటుందన్నాడు. జట్టు కూర్పును బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. తాను చేయగలిగింది అంతా చేశానన్నాడు. సమయం వచ్చినప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయన్నాడు. అప్పటి వరకు కష్టపడి ఆడుతూనే ఉంటానన్నాడు.
వన్డే ప్రపంచకప్ గెలవడమే తన లక్ష్యం అని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 తనకెంతో ప్రత్యేకమైందన్నాడు. కప్‌ను గెలిచి స్వదేశానికి వచ్చినప్పుడు లభించిన స్వాగతాన్ని తాను ఎన్నటికి మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు.
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తనకు మెంటార్ అని, అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు యశస్వి తెలిపాడు. కోహ్లీతో ఎంతో సరదాగా ఉంటానని, అతడితో కలిసి ఎన్నో సార్లు బ్యాటింగ్ చేశానన్నాడు. ఈ ఇద్దరూ సీనియర్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం అద్భుతం అని అన్నాడు.
భారత జట్టు అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జైస్వాల్ కు చోటు దక్కడం ఖాయమే.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు మ్యాచ్ – అక్టోబర్ 2 నుంచి 6 వరకు (అహ్మదాబాద్)
* రెండో టెస్టు మ్యాచ్ – అక్టోబర్ 10 నుంచి 14 వరకు (ఢిల్లీ)