India vs Oman : సంజూ శాంస‌న్ త‌ప్పించుకున్నాడు.. హార్దిక్ బ‌లి అయ్యాడు.. వీడియో వైర‌ల్‌..

ఒమ‌న్‌తో మ్యాచ్‌లో (India vs Oman) హార్దిక్ పాండ్యా ఔట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

India vs Oman : సంజూ శాంస‌న్ త‌ప్పించుకున్నాడు.. హార్దిక్ బ‌లి అయ్యాడు.. వీడియో వైర‌ల్‌..

Asia Cup 2025 India vs Oman Hardik Pandya run out video viral

Updated On : September 20, 2025 / 1:03 PM IST

India vs Oman : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది. శుక్ర‌వారం అబుదాబి వేదిక‌గా ఒమ‌న్‌తో ( India vs Oman) జ‌రిగిన మ్యాచ్‌లో 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో భార‌త ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఓ నాట‌కీయత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 72 ప‌రుగుల‌తో ఉంది. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవ‌ర్‌ను జితేన్ రామనంది వేశాడు. తొలి బంతికి అభిషేక్ శ‌ర్మ ఔట్ అయ్యాడు. దీంతో ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి అత‌డు సింగిల్‌కు తీశాడు.

IND vs Oman : కుల్దీప్ ఎంత ప‌ని చేశావు.. సూర్య చేత బ‌ల‌వంతంగా ఆ పని చేయిస్తావా.. ఇప్పుడు చూడు ఏమైందో..?

ఇక మూడో బంతిని సంజూ శాంస‌న్ స్ట్రైయిట్ డ్రైవ్ ఆడాడు. బౌల‌ర్ రామ‌నంది క్యాచ్ అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే.. బాల్ అత‌డి వేలి చివ‌ర‌న త‌గులుతూ వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాక‌డంతో బెయిల్స్ ప‌డ్డాయి. అయితే.. ఆ స‌మ‌యంలో హార్దిక్ పాండ్య క్రీజులో లేదు. దీంతో పాండ్యా దుర‌దృష్ట‌వ‌శాత్తు ర‌నౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

హార్దిక్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రామ‌నంది ఆ బంతి ప‌ట్టి ఉంటే సంజూ క్యాచ్ ఔట్ అయ్యేవాడ‌ని, అయితే.. అత‌డు తృటిలో ఔట్ నుంచి త‌ప్పించుకున్నాడ‌ని, కానీ హార్దిక్ బ‌లి అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. సంజూ శాంస‌న్ (56) రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో షా ఫైజల్‌, ఆమిర్‌ కలీమ్‌, జితేన్‌ రామనంది లు త‌లా రెండు వికెట్లు తీశారు.

Sunil Gavaskar : 8 వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్‌కు దిగ‌ని సూర్య‌.. సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్‌.. కుల్దీప్‌ను పంపి అత‌డు రాలేదంటే..

ఆ త‌రువాత లక్ష్య ఛేద‌న‌లో ఒమ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ తీశారు.