IND vs Oman : కుల్దీప్ ఎంత పని చేశావు.. సూర్య చేత బలవంతంగా ఆ పని చేయిస్తావా.. ఇప్పుడు చూడు ఏమైందో..?
ఒమన్‌తో మ్యాచ్‌లో (IND vs Oman) కుల్దీప్ యాదవ్ చేసిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Asia Cup 2025 IND vs Oman Kuldeep forcibly makes T signal with Suryakumar hands
IND vs Oman : ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో టీమ్ఇండియా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ ఒకరు. అయితే.. అతడు ఒమన్‌తో మ్యాచ్‌లో ఓ పొరబాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ (56) హాఫ్ సెంచరీ చేయగా, అబిషేక్ శర్మ (38), తిలక్ వర్మ (29) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, ఆమిర్ కలీమ్, జితేన్ రామనంది లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత 189 పరుగుల లక్ష్యంతో ఒమన్ బరిలోకి దిగింది. 8 ఓవర్లకు 55/0 స్కోరుతో లక్ష్యం దిశగా సాగుతోంది. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని ఒమన్ బ్యాటర్ అమీర్ కలీం స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి బ్యాట్‌ను మిస్సైంది. అతడి తొడను తాకింది. వెంటనే కుల్దీప్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ అని చెప్పాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) September 19, 2025
దీంతో రివ్య్వూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కుల్దీప్ యాదవ్ బలవంతం చేశాడు. సూర్య చేతిని టీ సిగ్నల్ ఇచ్చేలా చేశాడు. అటు సూర్య కూడా కుల్దీప్ బలవంతం చేయడంతో అయిష్టంగా రివ్య్వూ తీసుకున్నాడు. అయితే.. బంతి ఔట్ సైడ్ ఆఫ్‌గా ఉండడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో భారత రివ్య్వూ వృథాగా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్..!
దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక జన్మలో కుల్దీప్‌ను సూర్య నమ్మడని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఓవర్‌లోనే మూడో బంతికి జితేందర్ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి కుల్దీప్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు.
అమీర్ కలీం (64), హమ్మద్ మీర్జా (51) లు హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలినవారు విఫలం కావడంతో ఒమన్ లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.