Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? అమెజాన్‌లో టాప్ 7 ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏ వాచ్ కొంటారో మీఇష్టం..!

Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై డిస్కౌంట్లను పొందవచ్చు.

1/8Amazon Great Indian Festival Sale
Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? మరో రెండు రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. హెల్త్, ఫిట్‌నెస్ కోసం చూసేవారికి ఈ హై-ఎండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతంగా ఉంటాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, హెల్త్ ట్రాకింగ్ కోసం వినియోగించుకోవచ్చు. ఆకట్టుకునేలా అమోల్డ్ స్క్రీన్‌లు ఉన్నాయి. హార్ట్ రేట్ SpO₂, స్టెప్స్, స్లీప్, స్ట్రెస్ 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌ హెల్త్ ట్రాకింగ్ ఫంక్షన్లు కలిగి ఉన్నాయి. స్టైల్, ఫిట్‌నెస్ తో పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.
2/8Amazfit Smart Watch Bip 6
అమాజ్‌ఫిట్ స్మార్ట్ వాచ్ బిప్ 6 : అమాజ్‌ఫిట్ స్మార్ట్ వాచ్ బిప్ 6 అసలు ధర రూ.14,999 ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు రూ. 7,999కి అందుబాటులో ఉంది. 47శాతం సేవ్ చేసుకోవచ్చు. 1.97-అంగుళాల భారీ అమోల్డ్ స్క్రీన్, 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. స్లీప్, ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కలిగి ఉంది. జీపీఎస్ ఫ్రీ మ్యాప్‌ ద్వారా మీరు ఫోన్ లేకుండా రూట్ తెలుసుకోవచ్చు. 5ATM వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 140 కన్నా ఎక్కువ ట్రైనింగ్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ కూడా సపోర్టు ఇస్తుంది.
3/8Huawei Watch FIT 4
వన్‌ప్లస్ వాచ్ 2R : ఈ స్మార్ట్‌వాచ్ రిటైల్ ధర రూ.15,999 ఉండగా రూ. 776 నెలవారీ ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు. గూగుల్ WearOS 4 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. 1.43″ అమోల్డ్ డిస్‌ప్లే, పవర్‌‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ W5 CPU కలిగి ఉంది. 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌తో వస్తుంది. ఈ వాచ్ ఫిట్‌నెస్, హెల్త్ ట్రాక్ చేస్తుంది. 100 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. అలాగే, IP68 డస్ట్ ప్రొటెక్షన్, 5ATM వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ కాలింగ్‌ కలిగి ఉంది.
4/8Halo 2 Smart Watch
హాలో 2 స్మార్ట్ వాచ్ : ఈ హాలో 2 స్మార్ట్ వాచ్ ధర రూ. 26,499. అద్భుతమైన డిజైన్‌‌‌తో వస్తుంది. 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ద్వారా క్లియర్ ఫొటోలతో అద్భుతంగా ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ కలిగి ఉంది. హెల్త్ సూట్, పర్సనలైజడ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, బ్లూటూత్ కాలింగ్‌ కలిగి ఉంది. బ్రౌట్ కలర్ బెల్ట్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
5/8Huawei Watch FIT 4
హువావే వాచ్ FIT 4 : ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 11,999. అద్భుతమైన ఫ్యాషన్ వాచ్. హెల్త్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ ఫిట్‌నెస్ వాచ్. 1.82-అంగుళాల అమోల్డ స్క్రీన్‌ కలిగి ఉంది. 10-రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. రెగ్యులర్ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, డ్యూయల్-బ్యాండ్ GPS, హెల్త్ ట్రాకింగ్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే, స్ట్రెస్, మానసిక స్థితిని ట్రాక్ చేసే ఎమోషనల్ అసిస్టెంట్‌ కలిగి ఉంది.
6/8Garmin Forerunner
గార్మిన్ ఫోర్‌రన్నర్ : ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 26,990. అలాగే, రూ. 1,309 నెలవారీ ఈఎంఐంతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకంగా రన్నింగ్, వ్యాయామం చేసేవారికి అద్భుతంగా ఉంటుంది. 43mm తేలికైన డిజైన్, అమోల్డ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో ఆపరేట్ చేయడం చాలా ఈజీ. హార్ట్ రేట్ రేటు ట్రాకింగ్, జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. 11 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. గార్మిన్ కోచ్ కోసం ట్రైనింగ్ ప్లానింగ్ కూడా పొందవచ్చు.
7/8Samsung Galaxy Watch 7
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 : శాంసంగ్ స్మార్ట్ వాచ్ ధర రూ. 18,285. ఈ హై-ఎండ్ స్మార్ట్‌వాచ్ ఫిట్‌‌నెస్. డ్యూయల్ GPS, 3nm ప్రాసెసర్ అత్యంత వేగంగా పనిచేస్తుంది. సప్పైర్ గ్లాస్, అల్యూమినియం ఆర్మర్ బాడీ మరింత స్ట్రాంగ్ ఉంటుంది. వాచ్‌లో IP68 వాటర్ ప్రూఫింగ్, 5ATM ఉన్నాయి. అలాగే, బ్లడ్ ప్రెజర్, ECG, HR, SpO2 మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది.
8/8Apple Watch SE 3
ఆపిల్ వాచ్ SE 3 : ఆపిల్ వాచ్ SE 3 ధర రూ. 33,900 మాత్రమే. కనెక్టివిటీ, ఫిట్‌నెస్, హెల్త్ ట్రాక్ చేస్తుంది. వైటల్స్ యాప్‌తో టెంపరేచర్ డిటెక్షన్, హెల్త్ ట్రాకింగ్‌ చేస్తుంది. అలాగే, హార్ట్ రేట్ నోటిఫికేషన్‌, డైలీ స్లీస్ స్కోర్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లో 8 గంటల బ్యాకప్ పవర్ అందిస్తుంది. బ్యాటరీ 18 గంటల లైఫ్ వస్తుంది. డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. 5G కనెక్టివిటీతో ఐఫోన్ లేకుండా కాల్స్, మెసేజింగ్, మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.