Nationalised Banks : రుణగ్రహీతలకు పండగే.. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారా? భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

Nationalised Banks : ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను తగ్గించాయి.. ఈఎంఐలు ఎంత తగ్గనున్నాయంటే?

Nationalised Banks : రుణగ్రహీతలకు పండగే.. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారా? భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!

Nationalised Banks

Updated On : December 8, 2025 / 11:45 AM IST

Nationalised Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత అనేక జాతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. గత రెండు రోజులుగా గృహ, కారు, విద్య ఇతర రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR)తో సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి.

దాంతో హోం లోన్లు సహా ఇతర (Nationalised Banks) లోన్లపై ఈఎంఐలు తగ్గనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. జనవరి 15 తర్వాత ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం ఉంది.

ఏయే బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గాయంటే? :
ఒక బేసిస్ పాయింట్ అంటే.. వందో వంతు శాతం పాయింట్. అయితే, బ్యాంకులు తమ మార్జిన్‌లను కాపాడుకునే ప్రయత్నంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ను తగ్గించడం లేదు. ఎంసీఎల్ఆర్ రుణాలు ఎక్కువగా కంపెనీలకు అందించాయి.

Read Also : Big Year-End Deal : మారుతి డిజైర్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. 33 కి.మీ మైలేజ్, ధర రూ. 6.25 లక్షలు.. దేశంలోనే నెం.1 కారు..!

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలు ఇప్పుడు 7.10 శాతం నుంచి ప్రారంభమవుతాయి. కారు రుణాలు 7.45 శాతంగా ఉంటాయి. ఇండియన్ బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. PNB బ్యాంకు కూడా ఆర్ఎల్ఎల్ఆర్‌ను 8.35 శాతం నుంచి 8.10 శాతానికి సవరిస్తున్నట్లు తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా RLLRను ప్రస్తుతమున్న 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్లపై తగ్గించిన వడ్డీ రేట్లు వచ్చే జనవరి 15 నుంచి 15 మధ్య అమల్లోకి రానున్నాయి. చాలా ప్రైవేట్ విదేశీ బ్యాంకులు త్రైమాసిక రీసెట్ విధానాన్ని కలిగి ఉంటాయి. ఆ ప్రభావం వచ్చే త్రైమాసికంలో మాత్రమే కనిపిస్తుంది.

లోన్ త్వరగా క్లియర్ అవ్వాలంటే? :

నవంబర్ 2025లో రెపో రేటుతో ఉన్న రూ. 50 లక్షల రుణాన్ని 25 ఏళ్ల కాలానికి (300 ఈఎంఐలు) తీసుకున్న గృహ రుణగ్రహీత రూ. 36,950 ఈఎంఐ చెల్లిస్తారు. ఈఎంఐ తగ్గించి లోన్ కాలపరిమితి స్థిరంగా ఉంటే కొత్త ఈఎంఐ రూ. 36140గా ఉంటుంది. ఫలితంగా లోన్ వ్యవధిలో మొత్తం రూ. 2.42 లక్షల వడ్డీ ఆదా అవుతుంది.

ఈఎంఐ నిలుపుకుని లోన్ కాలపరిమితిని తగ్గించాలని ఎంచుకుంటే.. మొత్తం ఈఎంఐలు 18 తగ్గుతాయి (300 నుంచి 282కి) ఫలితంగా రూ. 6.48 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. ఒకవేళ.. ఈఎంఐని మార్చకుండా తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే అధిక వడ్డీ ఆదా అవుతుంది . మీ లోన్ త్వరగా క్లియర్ అవుతుంది.