Big Year-End Deal : మారుతి డిజైర్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. 33 కి.మీ మైలేజ్, ధర రూ. 6.25 లక్షలు.. దేశంలోనే నెం.1 కారు..!
Big Year-End Deal : మారుతి సుజుకి డిజైర్ కారు బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సమయమంలో భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. 33కి.మీ మైలేజీతో పాటు రూ. 6.25 లక్షలకు కొనుగోలు చేయొచ్చు.
Big Year-End Deal
Big Year-End Deal : కొత్త కారు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. డిసెంబర్ నెల ముగుస్తోంది. కొత్త ఏడాది రాబోతుంది. ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అనేక ఆటో తయారీ కంపెనీలు తమ కార్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
డిసెంబర్ 2025లో ప్రస్తుతం మారుతి డిజైర్ కొనుగోలుపై (Big Year-End Deal) భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ మారుతి డిజైర్ కారు కొనుగోలుపై ఏకంగా రూ. 12,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం..
సాధారణంగా డిసెంబర్ నెలలో అనేక బ్రాండ్ల కార్లపై అతిపెద్ద డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాదిలో మారుతి డిజైర్ కూడా లిస్టులో నిలిచింది. మీరు అద్భుతమైన మంచి మైలేజీని అందించే కారు, మెయింట్‌నెన్స్ చాలా చవకైన ఫ్యామిలీ కారు కోసం చూస్తుంటే ఇదే బెటర్ టైమ్.
మీకు మీ ఫ్యామిలీకి అన్ని విధాలుగా సరిపోయే సెడాన్ కారును కొనేసుకోవచ్చు. ఎందుకంటే.. మారుతి కంపెనీ ఈ డిసెంబర్‌లో డిజైర్‌పై పూర్తి రూ. 12,500 తగ్గింపును అందిస్తోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్‌లలో వర్తిస్తుంది.
డిస్కౌంట్ ఎంతంటే?:
మారుతి డిజైర్ కారుపై ప్రస్తుతం మొత్తం బెనిఫిట్స్ రూ. 12,500 వద్ద ఉన్నాయి. ఇందులో డీలర్ లెవల్ డిస్కౌంట్ రూ. 10వేలు ఉంటుంది. అదనపు బెనిఫిట్స్ కింద రూ. 2,500 పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ స్కీమ్ లేదని గమనించాలి. మీరు పెట్రోల్ లేదా AMT వేరియంట్ కొనుగోలు చేసినా అదే బెనిఫిట్స్ పొందవచ్చు.
మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర :
మారుతి డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.25 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ రూ. 9.31 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరకు డిస్కౌంట్ యాడ్ చేస్తే మారుతి డిజైర్ మరింత సరసమైన ధరకే లభిస్తుంది.
భారత్‌లో పాపులర్ సెడాన్ ఏంటి? :
దేశీయ మార్కెట్లో మారుతి డిజైర్ పాపులారిటీ పెరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం.. అద్భుతమైన ఇంధన ఆర్థిక వ్యవస్థ (20+kmpl). ఈ కారు ఇప్పుడు నిర్మాణ క్వాలిటీ అనేక ఆకట్టుకునే సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. మృదువైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, సౌకర్యవంతమైన రైడ్, వైడ్ బూట్ స్పేస్ కలిగి ఉంది. నగర డ్రైవ్ అయినా లేదా లాంగ్ హైవే ట్రిప్ అయినా డిజైర్ ఎల్లప్పుడూ అద్భుతమైన ఫ్యామిలీ సెడాన్‌గా మారుతుంది.
మీ బడ్జెట్ ధరలో వేరియంట్? :
మీరు బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కలిగిన కారు కోసం చూస్తుంటే మారుతి డిజైర్ VXi బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు AMT కోరుకుంటే.. VXi AMT అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
