Best Camera Phones : ఫొటో తీస్తే నమ్మలేరు.. 2025లో ఆల్‌టైమ్ క్రేజీ 5 కెమెరా ఫోన్లు ఇవే.. మీ ఫేవరెంట్ ఫోన్ కొనేసుకోండి..!

Best Camera Phones : ఫొటోగ్రఫీ కోసం అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ కెమెరా ఫోన్లలో ఏది కొంటారో కొనేసుకోండి.

Best Camera Phones : ఫొటో తీస్తే నమ్మలేరు.. 2025లో ఆల్‌టైమ్ క్రేజీ 5 కెమెరా ఫోన్లు ఇవే.. మీ ఫేవరెంట్ ఫోన్ కొనేసుకోండి..!

Best Camera Phones

Updated On : December 7, 2025 / 5:06 PM IST

Best Camera Phones : కొత్త కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2025లో భారత మార్కెట్లో మంచి కెమెరా ఫీచర్లు కలిగిన అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఫొటోగ్రఫీ ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇది మీకోసమే.. టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్లలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, వివో X300 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో, ఒప్పో ఫైండ్ X9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కెమెరా ఫీచర్ల కోసమైన ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ కొనేసుకోవచ్చు.

1. ఒప్పో ఫైండ్ X9 ప్రో :
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ 2025లో అత్యుత్తమ (Best Camera Phones)  కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ట్రిపుల్ వెర్సటైల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో OISతో 50MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి.

ఫ్రంట్ సైడ్ 4K రిజల్యూషన్ వరకు రికార్డింగ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి పవర్‌హౌస్, డాల్బీ విజన్ వీడియో సపోర్ట్, LOG రికార్డింగ్ హాసెల్‌బ్లాడ్ కలర్ కాలిబ్రేషన్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో సుమారు రూ. 1,09,999 ధరకే లభిస్తుంది.

2. వివో X300 ప్రో :
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP వైడ్ సెన్సార్, 3.7x ఆప్టికల్ జూమ్, మాక్రో సామర్థ్యంతో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ 8K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. డాల్బీ విజన్ HDRకి సపోర్టు ఇస్తుంది. జీసెస్ ఆప్టిక్స్‌తో అమర్చి ఉంటుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 50MP 4K సెల్ఫీ కెమెరా ఉంది. రోజువారీ వ్లాగింగ్ లేదా సాధారణ సెల్ఫీలు కోసమైనా తీసుకోవచ్చు ఈ వివో బెస్ట్ ఫోన్ ధర రూ. 1,09,999కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Flipkart Buy Buy Sale 2025 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో T4 అల్ట్రా ఫోన్ చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..!

3. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 200MP ప్రైమరీ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 10MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో ఫొటోగ్రఫీని అందిస్తుంది. మీరు 8K రిజల్యూషన్ వీడియోలను సులభంగా రికార్డ్ చేయవచ్చు. HDR10+కి కూడా సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారత మార్కెట్లో సుమారు రూ. 1,07,999 ధరకు లభిస్తుంది.

4. గూగుల్ పిక్సెల్ 10 ప్రో :

గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ + 5x జూమ్ + 48MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అయితే, ఫ్రంట్ సైడ్ 42MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

మీరు సెల్ఫీ కెమెరా నుంచి 4K రిజల్యూషన్ వరకు ఈజీ రికార్డ్ చేయవచ్చు. పవర్‌ఫుల్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీతో క్రిస్టల్-క్లియర్ ఫొటోలు, వీడియోలను అందిస్తుంది. ఈ పిక్సెల్ 10 ప్రో ఫోన్ భారత మార్కెట్లో సుమారు రూ.1,09,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

5. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ :
2025లో అత్యంత కెమెరా ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్ సైడ్ ట్రిపుల్-లెన్స్ సెటప్ కలిగి ఉంది. 48MP మెయిన్ సెన్సార్ + 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ + 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజింగ్‌తో పవర్‌‌ఫుల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోరుకునే చాలామంది లేటెస్ట్ ఐఫోన్లు ఎంచుకుంటారు.

ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ప్రస్తుత బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. భారతీయ మార్కెట్లో ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర సుమారు రూ. 1,49,900 నుంచి లభ్యమవుతుంది.