Flipkart Buy Buy Sale 2025 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో T4 అల్ట్రా ఫోన్ చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే..!

Vivo T4 Ultra : వివో అతి తక్కువ ధరకే లభిస్తోంది. వివో T4 అల్ట్రా ఫోన్ 50MP OIS కెమెరా ఫీచర్లతో రూ. 30వేల లోపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6Buy Buy Sale 2025
Vivo T4 Ultra : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. అద్భుతమైన ఫొటోల కోసం మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. 100x హైపర్‌జూమ్‌తో వివో T4 అల్ట్రా 5G ఫోన్ కొనేసుకోండి. మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లలో ఈ వివో ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
2/6Vivo T4 Ultra
ఇలాంటి క్రేజీ ఫోన్ అసలు వదులుకోవద్దు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బైబై సేల్ సమయంలో వివో ఫోన్ అనేక అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లతో లభ్యమవుతోంది. అత్యంత సరసమైన ధరకు వివో అల్ట్రా 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
3/6Vivo T4 Ultra
వివో T4 అల్ట్రాపై 12శాతం తగ్గింపు : ధర విషయానికి వస్తే.. వివో T4 అల్ట్రా ఫోన్ రూ.40,999కు లభిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 12శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో ధర రూ. 35,999 అవుతుంది. బ్యాంకు ఆఫర్లతో ధరను మరింత తగ్గించవచ్చు.
4/6Vivo T4 Ultra
బ్యాంక్ ఆఫర్లు : బ్యాంక్ ఆఫర్ల కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 2,750 తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.2,632 తగ్గింపు అందిస్తోంది. HDFC, SBI బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అదనంగా, మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 35,050 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇంకా, మీరు రూ. 5,709 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.
5/6Vivo T4 Ultra
వివో T4 అల్ట్రా డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ : ఈ వివో అల్ట్రా ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ 2800×1260 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ కలిగి ఉంది. టాప్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్, పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్OS ఆధారంగా రూపొందింది.
6/6Vivo T4 Ultra
కెమెరా, బ్యాటరీ, ఇతర ఫీచర్లు : కెమెరా, వీడియోల కోసం ఈ వివో ఫోన్ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. సెకండరీ కెమెరా 8MP, మూడో కెమెరా 50MP కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు క్లిక్ కోసం 32MP కెమెరా ఉంది. బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రెసిస్టెంట్, Wi-Fi, బ్లూటూత్, GPS వంటి ఇతర ఫీచర్లు కూడా కలిగి ఉంది.