Eesha Trailer : వామ్మో.. ట్రైలర్ తోనే భయపెట్టారుగా.. రాజు వెడ్స్ రాంబాయి హీరో హారర్ సినిమా ట్రైలర్ రిలీజ్..
మీరు కూడా ఈషా ట్రైలర్ చూసేయండి.. (Eesha Trailer)
Eesha Trailer
Eesha Trailer : ఇటీవలే రాజు వెడ్స్ రాంబాయి తో హిట్ కొట్టిన అఖిల్ రాజ్ తో పాటు హెబ్బా పటేల్, త్రిగుణ్, సిరి హన్మంత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఈషా. దామోదర్ ప్రసాద్ సమర్పణలో HVR ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోతుల హేమ వెంకటేశ్వర రావు నిర్మాణంలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Eesha Trailer)
బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని డిసెంబర్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ రిలీజవ్వగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆత్మలు ఉన్నాయా అనే ప్రశ్నతో కొంతమంది ఓ బంగ్లాలోకి వెళ్లడం, అక్కడ వాళ్ళు ఎదుర్కున్న సంఘటనలతో, ఓ ఫ్లాష్ బ్యాక్ తో ట్రైలర్ లోనే భయపెట్టారు. దీంతో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా రాబోతుందని తెలుస్తుంది.
Also Read : Rajasaab : అఖండ 2 లాగే ప్రభాస్ రాజాసాబ్ ఆగిపోతుందా..? క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
మీరు కూడా ఈషా ట్రైలర్ చూసేయండి..
