Rajasaab : అఖండ 2 లాగే ప్రభాస్ రాజాసాబ్ ఆగిపోతుందా..? క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
అసలే రాజాసాబ్ సినిమా సంవత్సరం నుంచి వాయిదా పడుతూ వస్తుంది. (Rajasaab)
Rajasaab
Rajasaab : ఇటీవల రిలీజవ్వల్సిన బాలకృష్ణ అఖండ 2 సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిర్మాతల పాత బాకీలు, ఫైన్షియర్స్ కి డబ్బులు క్లియర్ చేయకపోవడం లాంటి పలు ఆర్ధిక సమస్యలతోనే ఈ సినిమా ఆగింది. ఎంతో హైప్ ఉన్న అఖండ 2 సినిమా ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్ రాజాసాబ్ పై కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు.(Rajasaab)
అసలే రాజాసాబ్ సినిమా సంవత్సరం నుంచి వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ ఈ సినిమాలో ఏకంగా 218 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు, అనుకున్న టైంకి సినిమా అవ్వలేదని, నిర్మాణ సంస్థ తాము చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు కూడా వెళ్లారు. ఆ ఇష్యూ అప్పటికైతే సద్దుమణిగింది. ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ తో మళ్ళీ రాజాసాబ్ రిలీజ్ సమయానికి ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తారేమో అని వార్తలు వస్తున్నాయి.
దీంతో రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దీనిపై స్పందించారు. ఓ ఈవెంట్లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ కోసం బయట నుంచి తెచ్చిన పెట్టుబడులు అన్ని క్లియర్ చేశాం. వేరే నిధుల ద్వారా ఆ క్లియరెన్స్ జరిగింది. కొన్ని వడ్డీలు మాత్రం ఉన్నాయి. సినిమా బిజినెస్ జరిగే సమయానికి అవి కూడా క్లియర్ చేస్తాం. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు.
అలాగే సినిమా రిలీజ్ ముందు అడ్డంకులు సృష్టిస్తున్న విషయంపై స్పందిస్తూ.. ఆఖరి నిమిషంలో సినిమాలకు అవాంతరాలు సృష్టిస్తే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ తో పాటు వేలాది మంది జీవనోపాధి పై ఎఫెక్ట్ పడుతుంది. థర్డ్ పార్టీ వ్యక్తులు చివరి నిమిషంలో సినిమాలకు అంతరాయం కలిగించకుండా భవిష్యత్తులో చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించాలి అని అన్నారు.
Also Read : Rashi Singh : ఇంటర్ లో ఏకంగా లెక్చరర్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్.. తన లవ్ స్టోరీ బయట పెట్టిన రాశీసింగ్..
