AI Movie : వామ్మో.. అకిరా హీరోగా AI తో సినిమా తీసేసారుగా.. పవన్, రేణు దేశాయ్, గౌతమ్, హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్.. ఈ సినిమా చూశారా..?

పవన్ తనయుడు అకిరా నందన్ ని హీరోగా పెట్టి AI తో సినిమా తీసేసాడు.(AI Movie)

AI Movie : వామ్మో.. అకిరా హీరోగా AI తో సినిమా తీసేసారుగా.. పవన్, రేణు దేశాయ్, గౌతమ్, హాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్స్.. ఈ సినిమా చూశారా..?

AI Movie

Updated On : December 8, 2025 / 10:27 AM IST

AI Movie : ఏఐతో ఇప్పుడు అద్భుతాలే చేస్తున్నారు. ఊహలో ఉన్నవాటికి రూపం ఇస్తున్నారు. కొంతమంది ఏఐని మంచికి వాడుతుంటే కొంతమంది ఏఐని చెడుకి వాడుతున్నారు. సినీ పరిశ్రమలో కూడా ఏఐ భాగమవుతుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏకంగా ఏఐ ని వాడి సినిమా తీసేసాడు. అది కూడా పవన్ తనయుడు అకిరా నందన్ ని హీరోగా పెట్టి సినిమా తీసేసాడు.(AI Movie)

అకిరా నందన్ హీరోగా హాలీవుడ్ నటి విక్టోరియా హీరోయిన్ గా రజినీకాంత్, విల్ స్మిత్, మోహన్ బాబు, రేణు దేశాయ్, లియోనార్డో డికాప్రియో, జాక్వీన్ ఫోనెక్స్, గౌతమ్ ఘట్టమనేని, ఆర్నాల్డ్ స్క్వాజ్ఞర్, బ్రిట్నీ పియర్స్, పవన్ కళ్యాణ్.. పలువురు గెస్ట్ పాత్రల్లో దాదాపు గంట నిడివిగల సినిమాని ఏఐ తో సృష్టించారు. ఏఐ లవ్ స్టోరీ అనే టైటిల్ తో యూట్యూబ్ లో నెల రోజుల క్రితమే రిలీజ్ చేసారు.

Also Read : Rashi Singh : ఇంటర్ లో ఏకంగా లెక్చరర్ తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్.. తన లవ్ స్టోరీ బయట పెట్టిన రాశీసింగ్..

ఇప్పుడు ఈ ఏఐ లవ్ స్టోరీ సినిమా వైరల్ గా మారింది. ఈ సినిమా అంతా టెక్నలాజి, లవ్ స్టోరీ, గ్రహాల మీదకు వెళ్లడం, బ్రెయిన్ డేటా.. లాంటి అంశాలను కథాంశంగా తీసుకొని లవ్ సస్పెన్స్ స్టోరీతో తెరకెక్కించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని తెగ వైరల్ చేస్తున్నారు. చివర్లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలిసి రావడం, మధ్యలో మహేష్ కొడుకు గౌతమ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం కూడా బాగున్నాయి.

మొత్తానికి ఏఐ ని వాడి సినిమాని తీసేసారు. పవన్ తనయుడు అకిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే ఈ వీడియోతో హీరో అయిపోయాడు అంటున్నారు. భవిష్యత్తులో నటీనటులు లేకుండానే వారిని ఏఐలో సృష్టించి సినిమాలు తీసే రోజులు ఉన్నాయని ఈ సినిమాతో తెలిసిపోతుంది. దీనిపై సినీ పరిశ్రమ వ్యక్తులు అయితే ఇంకా ఎవరూ స్పందించలేదు. మరి ఏఐ వాడి నటీనటుల ముఖాలను వాడి ఈ సినిమా తీయడంపై ఎవరైనా సెలబ్రిటీలు స్పందిస్తారేమో చూడాలి.

Also Read : Suresh Bobbili : ఆఫీస్ బాయ్ నుంచి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. రాజు వెడ్స్ రాంబాయి తో రీసెంట్ హిట్ కొట్టి..

మీరు కూడా ఈ ఏఐ లవ్ స్టోరీ సినిమా చూసేయండి..