Suresh Bobbili : ఆఫీస్ బాయ్ నుంచి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. రాజు వెడ్స్ రాంబాయి తో రీసెంట్ హిట్ కొట్టి..

సురేష్ బొబ్బిలి తాజాగా 10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Suresh Bobbili)

Suresh Bobbili : ఆఫీస్ బాయ్ నుంచి సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. రాజు వెడ్స్ రాంబాయి తో రీసెంట్ హిట్ కొట్టి..

Suresh Bobbili

Updated On : December 8, 2025 / 9:14 AM IST

Suresh Bobbili : ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో బిగ్ సక్సెస్ కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. గతంలో నీది నాది ఒకే కథ, విరాటపర్వం, 90S సిరీస్.. లాంటి మంచి మ్యూజిక్ హిట్స్ ఉన్నా ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి తో వైరల్ అవుతున్నాడు సురేష్ బొబ్బిలి.(Suresh Bobbili)

ఈ సక్సెస్ లో సురేష్ బొబ్బిలి తాజాగా 10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన జర్నీ గురించి తెలిపాడు.

Also See : Pawan Kalyan : మోకాళ్లపై కూర్చొని సన్మానం తీసుకున్న పవన్.. ఏకంగా ఆ బిరుదుతో సత్కారం.. కర్ణాటకలో పవన్ రేంజ్ ఇది..

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు మా ఊరి దగ్గరే. ఆయన వల్లే మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మా అన్నయ్య వాళ్ళు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడికి వస్తాను అంటే మొదట వద్దన్నారు. తర్వాత నా వాళ్ళ అవ్వట్లేదని వచ్చేసాను. ఒక తెలిసిన అన్న మ్యూజిక్ స్టూడియోలో కొంతమంది ఉంటున్నారు. నన్ను కూడా అక్కడ ఉంచమని మా అన్న అడిగితే కుదరదు ఖర్చు పెరిగిపోద్ది అన్నారు.

అప్పుడే ఆ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ మానేసాడు. అతనికి 4000 జీతం ఇస్తున్నారు. నేను ఆ ఆఫీస్ బాయ్ పని చేస్తాను, అతనికి ఎలాగో డబ్బులు ఇస్తున్నారు కదా నాకు డబ్బులు వద్దు ఫుడ్ పెట్టి, అక్కడే ఉండేలా చూసుకోండి అంటే ఓకే అన్నారు. అలా అక్కడే ఉండి మ్యూజిక్ స్టూడియోలో అన్ని నేర్చుకున్నా. ఆరు నెలలు అక్కడే ఆఫీస్ బాయ్ గా పని చేసాను. ఆరు నెలల తర్వాత అక్కడే సౌండ్ ఇంజినీర్ అయ్యాను అని తెలిపారు.

Also Read : Suresh Bobbili : సినిమా రిలీజ్ కి ముందు నాన్న మరణం.. ఆ హీరో నా అకౌంట్లో డబ్బులు వేసి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్..

అలా తర్వాత మ్యూజిక్ లో ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ప్రైవేట్ ఆల్బమ్స్, తెలంగాణ సాంగ్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు సురేష్ బొబ్బిలి. డైరెక్టర్ వేణు ఉడుగుల నీది నాది ఒకే కథ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. అక్కడ్నుంచి సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఒక ఆఫీస్ బాయ్ గా మొదలుపెట్టి ఏమి తెలియని దగ్గర్నుంచి అన్ని నేర్చుకొని ఇప్పుడు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు సురేష్ బొబ్బిలి.