Suresh Bobbili : సినిమా రిలీజ్ కి ముందు నాన్న మరణం.. ఆ హీరో నా అకౌంట్లో డబ్బులు వేసి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్..
ఈ క్రమంలో తన తండ్రి చనిపోయినప్పుడు ఓ హీరో చేసిన హెల్ప్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. (Suresh Bobbili)
Suresh Bobbili
Suresh Bobbili : సినీ పరిశ్రమలో హీరోలు అనేయమందికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయాలు బయటకు చెప్పుకోరు. సహాయం పొందినవాళ్లు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో, మీడియా ముందు చెప్తేనే హీరోలు చేసే సహాయాలు బయటకు వస్తాయి. తాజాగా రీసెంట్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తనకు ఓ హీరో చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చాడు.(Suresh Bobbili)
ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తాజాగా 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో తన తండ్రి చనిపోయినప్పుడు ఓ హీరో చేసిన హెల్ప్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. 2006 లో మా అమ్మ చనిపోయింది. నా మొదటి సినిమా నీది నాది ఒకే కథ రిలీజ్ కి వారం రోజుల ముందు మా నాన్న చనిపోయారు. నా సక్సెస్ చూడకుండానే చనిపోయారు ఇద్దరు. మా నాన్న పొలంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. హీరో శ్రీ విష్ణుకి ఈ విషయం తెలిసింది. నా దగ్గర డబ్బులు లేవు అని అర్ధం చేసుకొని శ్రీ విష్ణు గారు చాలా పెద్ద అమౌంట్ నా అకౌంట్ లో వేశారు. నేను షాక్ అయ్యాను. అంతేకాక ఇంకా ఏమైనా అవసరం అయితే చెప్పు అన్నారు శ్రీ విష్ణు.
అలాగే రిలీజ్ ముందు నీది నాది ఒకే కథ మూవీ చెక్ చేస్తున్నాము. సినిమా మోదట్లో మా నాన్న బొబ్బిలి శంభయ్య గారికి అంకితం అని వేశారు. నేను షాక్ అయ్యాను. విష్ణు గారు, మూవీ యూనిట్ అందరూ అనుకోని వేశారు. నేను అప్పుడు ఎమోషనల్ అయ్యాను అని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు శ్రీవిష్ణుని అభినందిస్తున్నారు.
Also See : Pawan Kalyan : కర్ణాటక ఉడుపి క్షేత్రం.. శ్రీకృష్ణ ఆలయంలో పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
