Year-End Car Sales : 2025 ఇయర్ ఎండ్ సేల్స్.. లక్ష డిస్కౌంట్ చూసి టెంప్ట్ అవ్వొద్దు.. కొత్త కారు కొనేముందు ఫస్ట్ ఇవి తెలుసుకోండి..!
Year-End Car Sales December 2025 : డిసెంబర్ నెలలో ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు చూసి కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి ఆఫర్‌లను పొందవచ్చు.
Year-End Car Sales December 2025
Year-End Car Sales December 2025 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు కారు కొనే ముందు కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. లక్ష డిస్కౌంట్లు అనగానే టెంప్ట్ అవ్వద్దు. లేదంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. డిసెంబర్ 2025లో దాదాపు అన్ని ఆటోమేకర్లు తమ కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను కూడా అందిస్తుంటారు. కొన్ని కంపెనీలు నవంబర్ నుంచే ఈ డిస్కౌంట్లను అందిస్తుంటాయి.
కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ఇయర్ ఎండ్ (Year-End Car Sales December 2025) డిస్కౌంట్లతో పాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నాయి. మొత్తంమీద, మీరు ఏడాది చివరి నెలలో కారు కొనుగోలు చేస్తే.. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ బోనస్‌లు, ప్రత్యేక లేదా అదనపు ఆఫర్‌లతో పాటు భారీగా క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లతో కారు ధరపై అనేక లక్షల రూపాయలు తగ్గించవచ్చు.
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త..
సాధారణంగా ఇయర్ ఎండ్ డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. ఇదే సమయంలో ఈ డిస్కౌంట్ల కోసం వినియోగదారులు ఎగబడతారు. అయితే, ఈ కార్ల నుంచి భవిష్యత్తులో సంభవించే నష్టాలను మాత్రం పట్టించుకోరు. అందుకే ఇయర్ ఎండ్ సేల్ డిస్కౌంట్లతో కారు కొనాలా? వద్దా? అనేది అవగాహన కలిగి ఉండాలి. వాస్తవానికి, ఈ కార్ల వల్ల ఏయే కస్టమర్లకు నష్టం? ఇయర్ ఎండ్ డిస్కౌంట్లకు ప్రధాన కారణాలు ఏంటి? పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..
డిసెంబర్‌లోనే కార్లు చౌక ఎందుకంటే..? :
ప్రతి ఏడాది చివరిలో లక్షల డిస్కౌంట్ అందించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. దాదాపు అన్ని ఆటో కంపెనీలు డిసెంబర్ రాకముందే కార్ల ఉత్పత్తిని ఆపివేస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య తయారైన కారు, మోడల్ సంవత్సరం ప్రకారం జనవరిలో ఒక ఏడాది పూర్తి అవుతుంది.
అందుకే ఆటో కంపెనీలు ఇలా చేస్తాయి. అంటే, 2025లో తయారైన కారు టెక్నికల్‌గా జనవరి 2026 నాటికి ఒక ఏడాది అవుతుంది. దీని ప్రకారం.. జనవరిలో ఇలాంటి కార్లను కొనడానికి కస్టమర్లు ఉండరు. ఇలాంటి పరిస్థితిలో డీలర్లు స్టాక్‌ను క్లియర్ చేసేందుకు MY2025పై లక్షల డిస్కౌంట్ అందిస్తాయి. ప్రస్తుతం చాలా మంది డీలర్లు MY2024 కార్లను కూడా కలిగి ఉన్నారు.
- డిసెంబర్ ముందు కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తాయి.
- డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను క్లియర్ చేస్తాయి.
- జనవరిలో కార్ల మోడల్ సంవత్సరాన్ని మార్చుతాయి.
అన్ని కంపెనీలు జనవరి 2026కి ముందు తమ కార్ల స్టాక్‌లను క్లియర్ చేస్తుంటాయి. ఈ నెలలో అన్ని మోడళ్లు వేరియంట్‌లను విక్రయించాలని యోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో డీలర్లు కంపెనీ ఆఫర్‌లతో పాటు మీకు అదనపు బెనిఫిట్స్ అందించవచ్చు. ముఖ్యంగా కార్ల అమ్మకాలు తక్కువగా ఉన్న కంపెనీలకు లేదా ఒక నిర్దిష్ట మోడల్‌కు మీరు డీలర్ నుంచి భారీ డిస్కౌంట్ అభ్యర్థించవచ్చు.
కారు మోడల్ తయారీ సంవత్సరాన్ని గుర్తించండిలా :
ప్రతి కారు VIN నుంచి తయారీ సంవత్సరం తెలుస్తుంది. ప్రతి కారులో VIN సంఖ్య భిన్నంగా ఉంటుంది. మీరు కారు తయారీ సంవత్సరాన్ని సులభంగా కనుగొనవచ్చు. సంవత్సరంతో పాటు కారు ప్రొడక్షన్ నెల కూడా VIN నంబర్‌లో రిజిస్టర్ అవుతుంది. VIN సంఖ్య 17 అక్షరాలను కలిగి ఉంటుంది. ఇందులో 10వ అక్షరం సంవత్సరాన్ని సూచిస్తుంది. 11వ అక్షరం తయారీ నెలను సూచిస్తుంది.
కారు రీసేల్ వాల్యూపై ఎఫెక్ట్ :
ఏదైనా కారు అమ్ముడైతే.. షోరూమ్ నుంచి బయటకు రాగానే ధర తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటే ఒక ఏడాది తర్వాత పాత కారు అమ్మినప్పుడు ధర దాదాపు రూ. 2 లక్షలు తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో కారు మోడల్ సంవత్సరం డిసెంబర్ 2025 లేదా మోడల్ సంవత్సరం 2024 అయితే.. మీరు ఈ కారును జనవరి 2026లో కొనుగోలు చేస్తే.. మీ కారు ఒకటి లేదా రెండు ఏళ్లు పాతదిగా ఉంటుంది.
అంటే.. మీ పాత కారు రీసేల్ వాల్యూ కూడా తగ్గుతుంది అనమాట. ఇయర్ ఎండ్ డిస్కౌంట్ భవిష్యత్తులో మీ కారు ధరపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఈ నెలలో కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేందుకు తొందరపడొద్దు.
