2025లో గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికింది వీరికోసమే.. టాప్-10 జాబితా ఇదే..
Googles Most Searched People in 2025 : 2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఇయర్ ఎండింగ్ సందర్భంగా గూగుల్ తన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2025’ నివేదికను విడుదల చేసింది.
Googles Most Searched People in 2025 : 2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఇయర్ ఎండింగ్ సందర్భంగా గూగుల్ తన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2025’ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా వెతికిన వారిలో క్రీడా, వ్యాపార, రాజకీయ, సినిమా, పరిశోధన రంగాలకు చెందిన వారు ఉన్నారు.
ప్రతీ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా వెతిన వ్యక్తుల జాబితా మారుతూ ఉంటుంది. ప్రస్తుత సంఘటనలు, ట్రెండింగ్‌లో ఉన్న అంశాల ఆధారంగా సదరు వ్యక్తుల కోసం వెతికేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు. అలా ఈ ఏడాది అనేక రంగాలకు చెందిన ప్రముఖుల కోసం నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేశారు. వారిలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఉండటం విశేషం. అతనితోపాటు డేవిడ్ ఆంథోనీ బర్క్, కేండ్రిక్ లామర్, జిమ్మీ కిమ్మెల్ వంటి తారలు కూడా ఉన్నారు. జోహ్రాన్ మమ్దానీ వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
2025లో గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికింది వీరికోసమే..
♦ డేవిడ్ ఆంథోనీ బర్క్ : డేవిడ్ ఆంథోనీ బర్క్ అమెరికన్ గాయకుడు, గేయ రచయిత. ఇతన్ని D4vd అని కూడా పిలుస్తారు. 2005 మార్చి 28న జన్మించాడు. అతను 2022లో హియర్ విత్ మీ, రొమాంటిక్ హోమిసైడ్ వంటి పాటలను విడుదల చేసి ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత డార్క్‌రూమ్, ఇంటర్‌స్కోప్ రికార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇవి టిక్ టాక్ లో బాగా ప్రచుర్యం పొందాయి.

కేండ్రిక్ లామార్ : అమెరికన్ రాపర్, గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ నిర్మాత కేండ్రిక్ లామర్ డక్‌వర్త్. 1987 జూన్ 17న జన్మించాడు. పులిట్జర్ బహుమతితోసహా అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వెస్ట్ కోస్ట్ హిప్-హాప్‌లో మూలాలను కలిగి ఉన్న లామర్ సంగీతంలో ఆఫ్రికన్-అమెరికన్ సంస్కృతి గురించి సామాజిక వ్యాఖ్యానం, రాజకీయ విమర్శలను కలిగి ఉన్న ఆలోచనాత్మక, ప్రతిబింబించే సాహిత్యం ఉంటుంది.

జిమ్మీ కిమ్మెల్ : అమెరికన్ హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ జేమ్స్ క్రిస్టియన్ కిమ్మెల్ 13 నవంబర్ 1967న జన్మించారు. 2003 నుండి ABCలో ప్రసారమవుతున్న జిమ్మీ కిమ్మెల్ లైవ్ యొక్క ఎగ్జిక్యూటివ్ నిర్మాత, హోస్ట్ పాత్ర అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది. కిమ్మెల్ నాలుగు సార్లు అకాడమీ అవార్డులకు, మూడు సార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులకు హోస్ట్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

టైలర్ జేమ్స్ రాబిన్సన్ : టైలర్ జేమ్స్ రాబిన్సన్ 16 ఏప్రిల్ 2003న జన్మించాడు. గతేడాది చార్లీ కిర్క్ హత్యలో కాల్పులు జరిపిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల అమెరికన్ వ్యక్తి ఇతను.

పోప్ లియో XIV : రోమన్ కాథలిక్ చర్చి అధిపతి పోప్. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత, చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోప్‌గా పోప్ లియో XIV ఎన్నికయ్యారు.

వైభవ్ సూర్యవంశీ : 14 సంవత్సరాల వయసులో వైభవ్ సూర్యవంశీ IPL 2025లో జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతను పురుషుల T20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన సెంచరీ సాధించాడు. అతను తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో అనేక రికార్డులు సృష్టించాడు. 35 బంతుల్లో వచ్చిన అతని సెంచరీ ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ.

షెడ్యూర్ సాండర్స్ : షెడ్యూర్ సాండర్స్ అమెరికన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో క్వార్టర్ బ్యాక్ (కీలక ఆటగాడు). ముఖ్యంగా నేషనల్ ఫుల్‌బాల్ లీగ్ (NFL) లో క్లీవ్‌ల్యాండ్ బ్రౌన్స్ జట్టుకు ఆడుతున్నాడు. అతను గతంలో కొలరాడో బఫెలోస్ తరపున కళాశాల ఫుట్‌బాల్ ఆడాడు. అతని తండ్రి డియోన్ సాండర్స్ కూడా కోచ్ గా ఉన్నాడు. 2025 NFL డ్రాఫ్ట్‌లో అతను ఊహించిన దానికంటే వెనుకబడి ఐదో రౌండ్‌లో ఎంపిక కావడం చర్చనీయాంశమైంది.

బియాంకా సెన్సోరి : బియాంకా సెన్సోరి ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్చరల్ డిజైనర్, మోడల్. ఈమె అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్ రెండో భార్య. కాన్యే వెస్ట్ తో వివాహ బంధంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వీరు 2022లో వివాహం చేసుకున్నారు. బియాంకా సెన్సోరి విచిత్రమైన ఫ్యాషన్ ఎంపికలు, కాన్యే వెస్ట్‌కు చెందిన వైజెడ్‌వై ప్యాషన్ బ్రాండ్‌లో ఆమె పనితీరుతో తరుచుగా వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా గ్రామీ అవార్డుల వేడుకలో ఆమె బహిరంగంగా దుస్తులు లేకుండా కనిపించడం వివాదాస్పదమైంది. ఇలా కనిపించిన తర్వాత ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ వినిపించింది. అదనంగా, సెన్సోరి ఆ దుస్తుల చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

జోహ్రాన్ మమ్దానీ : ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్‌దానీ. ఆయన 1991 అక్టోబరులో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన ప్రస్తుత న్యూయార్క్ నగర మేయర్. అక్టోబర్ 2024లో ఆయన నామినేషన్ ప్రకటించినప్పుడు ఆయన న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీలో పెద్దగా పరిచయం లేని సభ్యుడు. మమ్దానీ తన విజయ ప్రసంగంలో ‘డొనాల్డ్ ట్రంప్! సౌండ్ పెంచుకుని వినండి’ అంటూ పలుసార్లు అధ్యక్షుణ్ని ఉద్దేశించి నేరుగా మాట్లాడారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. విజయంత తరువాత ట్రంప్‌తోనూ భేటీ అయ్యాడు.

గ్రెటా థన్‌బర్గ్ : గ్రెటా థన్‌బర్గ్ స్వీడన్ కు చెందిన పర్యావరణ కార్యకర్త. ఆమె 3 జనవరి 2023లో జన్మించారు. ఆమె పాఠశాలలో చదువుతున్నప్పుడే పర్యావరణంలో ఏర్పడుతున్న పెనుమార్పుల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులను సవాలు చేసింది. ఆమె 2018లో స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్ ఉద్యమం అని కూడా పిలువబడే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
థన్‌బర్గ్ ప్రభావాన్ని “గ్రేటా ప్రభావం”గా వర్ణించారు. వాతావరణ మార్పుపై కొంతమంది వ్యక్తుల అభిప్రాయాలను, చర్యలను మార్చడంలో ఆమెకు ఘనత లభించింది.
