Best Selling Smartphone : 2025లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే..!
Best Selling Smartphone : ప్రస్తుతం, 2025 మూడవ త్రైమాసికంలో ఐఫోన్ 16 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 16 వరుసగా మూడవ త్రైమాసికంలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
Best Selling Smartphone
Best Selling Smartphone : గ్లోబల్ మార్కెట్లో ఆపిల్ ఆధిపత్యం కొనసాగుతోంది. అన్ని బ్రాండ్లను అధిగమించి తనదైన సత్తా చాటుతోంది. 2025లో అత్యంతగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్లలో ఆపిల్ ఐఫోన్ 16తో టాప్ ప్లేసులో నిలిచింది. ఈ ఐఫోన్ ఈ ఏడాది అమ్మకాల్లో అన్ని ఫోన్లను దాటేసింది.
2025 మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16 ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. 4శాతం వాల్యూమ్ వాటాతో వరుసగా మూడో త్రైమాసికంలో కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆపిల్, శాంసంగ్ టాప్ 10 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ అత్యధిక దృష్టిని ఆకర్షిస్తోంది.
టాప్ ప్లేసులో ఐఫోన్ 16, శాంసంగ్ A సిరీస్ ఫోన్లు :
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం.. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఆపిల్ ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచంలో రెండో అత్యధిక అమ్మకాలు ఆపిల్ నిలవగామిగిలిన సగం శాంసంగ్ అమ్మకాలతో టాప్ ప్లేసులో నిలిచాయి. స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ ప్రస్తుతం 2 పాపులర్ బ్రాండ్‌లు శాసిస్తున్నాయి.
ఆపిల్ ప్రీమియం మోడల్‌లు ప్రపంచ మార్కెట్‌లో తమ స్థానాన్ని నిలుపుకున్నాయి. మరోవైపు, శాంసంగ్ బడ్జెట్, మిడ్ రేంజ్ మోడళ్లకు మార్కెట్ బలంగా ఉంది. ఐఫోన్ 17 సిరీస్ ప్రభావం రాబోయే నెలల్లో కచ్చితంగా కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతానికి, ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నంబర్-వన్ స్థానంలో దూసుకుపోతుంది.
Read Also : Nationalised Banks : రుణగ్రహీతలకు పండగే.. ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారా? భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!
వరుసగా 3 త్రైమాసికాలుగా అగ్రస్థానం :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 అద్భుతమైన అమ్మకాలను చూసింది. పండుగ సీజన్‌లో డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. భారత్ ఆపిల్‌కు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మారింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ 16 అమ్మకాలు భారీగా పెరుగుదలను చూశాయి.
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయినప్పటి నుంచి ఐఫోన్ 16 అమ్మకాలు పెద్దగా ప్రభావితం కాలేదు. చాలా మంది కొనుగోలుదారులు ఐఫోన్ 16 ప్రో మోడల్‌ను కొనుగోలు చేసినప్పటికీ, బేస్ మోడల్ ఐఫోన్ 16 పాపులారిటీ అసలు తగ్గలేదు. అందుకే.. ఈ ఐఫోన్ 16 మోడల్ వరుసగా 3 త్రైమాసికాలుగా అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆపిల్ ఐఫోన్లు పర్ఫార్మెన్స్ :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 16e కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో మొదటి 5 ర్యాంకుల్లో నిలిచాయి. ఐఫోన్ 16 ప్రో రెండో స్థానంలో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 3వ స్థానంలో, ఐఫోన్ 16e నాల్గవ స్థానంలో నిలిచాయి. ఈ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A16 5Gతో శాంసంగ్ 5వ స్థానంలో నిలిచింది.
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు (Q3 2025) :
1. ఐఫోన్ 16
2. గెలాక్సీ A16 5G
3. గెలాక్సీ A36
4. గెలాక్సీ A56
5. గెలాక్సీ A16 4G
6. గెలాక్సీ A06
7. ఐఫోన్ 16 ప్లస్
8. ఐఫోన్ 16 ప్రో
9. ఐఫోన్ 16 ప్రో మాక్స్
10. ఐఫోన్ 17 ప్రో మాక్స్
