Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లీక్.. సూపర్ హీరో లుక్ నెక్స్ట్ లెవల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఏఏ 22(Allu Arjun) సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాన ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

Allu Arjun's photo from the movie AA 22 leaked
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఏఏ 22 సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాన ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎవెంజర్స్, అవతార్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన వీఎఫెక్స్ సంస్థలు వర్క్ చేస్తున్నాయి. దానికి సంబందించి విడుదలైన వీడియోకి ఆడియన్స్ (Allu Arjun)నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా ఇటీవలే ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యారు.
Mirai: మిరాయ్ మేకర్స్ కి షాక్.. నా కథను కాపీ చేశారు.. హైకోర్టులో పిటీషన్ వేసిన రచయిత
ఇదిలా ఉంటే, ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ ఈ సినిమా ఎలా కనిపించబోతున్నాడు క్యూరియాసిటీ ఆడియన్స్ లో నెలకొంది. ఆ క్యూరియాసిటీ రెట్టింపు చేసేలా ఆయన లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ హీరో సూట్ లో, జుట్టు ముడివేసుకున్న అల్లు అర్జున్ ఫోటో ఒకటి షూటింగ్ లొకేషన్ నుండి లీక్ అయ్యింది. ఈ ఫోటో ఇప్పుడు ఈ సినిమాపై అంచలాను పెంచేస్తోంది. హాలీవుడ్ రేంజ్ బొమ్మ రాబోతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవనే చెప్పాలి.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 2026 మిడిల్ కల్లా కంప్లీట్ చేసి 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి మొదటి సారి సూపర్ హీరో కాన్సెప్ట్ లో అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఈ సినిమాకి తమిళ లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.