Starlink Price : గెట్ రెడీ.. భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోందోచ్.. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు లాంచ్ డేట్, స్పీడ్, ప్లాన్ల ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!
Starlink Price : భారతీయ ఇంటర్నెట్ యూజర్లకు పండగే.. భారత్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు ప్రారంభం కానుంది. ప్లాన్ ధరల వివరాలివే..

Starlink Price
Starlink Price : భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది. రాబోయే నెలల్లో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్టార్‌లింక్ లాంచ్ కానుంది. స్టార్‌లింక్ అనేది శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్థ. ఇప్పటికే దేశంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు కోసం దాదాపు అన్ని అప్రూవల్స్ వచ్చాయి.
అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే దేశంలో ఇంటర్నెట్ కార్యకలాపాలను స్టార్‌లింక్ ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇకపై ఇంటర్నెట్ సమస్య ఉండదు. అయితే, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసుకు సంబంధించి ధర, స్పీడ్, ప్లాన్లు వంటివి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.
భారత్ స్టార్‌లింక్ ధర, లాంచ్ తేదీ :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ సింగిల్ సెటప్ ఖర్చు రూ. 30వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. నెలవారీ ప్లాన్‌లు రూ. 3,300 నుంచి ప్రారంభమవుతాయి. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు ధరలు అనేవి ప్రాంతాలను బట్టి మారవచ్చు.
లాంచ్ తేదీ విషయానికొస్తే.. స్టార్‌లింక్ భారత మార్కెట్లో కార్యకలాపాల కోసం దాదాపు అన్ని అనుమతులు వచ్చేశాయి. ఇప్పుడు SATCOM గేట్‌వేకి ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన స్పెక్ట్రమ్‌ను పొందాల్సి ఉంది. ఈ సర్వీసు పూర్తి స్థాయిలో ప్రారంభానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టవచ్చు. అంటే.. డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు ప్రారంభం కావొచ్చు.
స్టార్‌లింక్ స్పీడ్, ప్లాన్లు, లభ్యత :
స్టార్‌లింక్ సర్వీస్ 25Mbps నుంచి 220Mbps మధ్య ఇంటర్నెట్ స్పీడ్ అందించగలదు. దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాలకు చేరుకోవడమే ఈ సర్వీసు ప్రధాన లక్ష్యం. ఈ సర్వీసు బేస్ ప్లాన్‌లు 25Mbps నుంచి 50Mbps వేగాన్ని అందిస్తాయి.
హై-ఎండ్ ప్లాన్‌లు 220Mbps వరకు పెరుగుతాయి. లభ్యత విషయానికొస్తే.. భారత మార్కెట్లో స్టార్‌లింక్ కనెక్షన్‌ల సంఖ్యపై భారత ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. దీని ప్రకారం.. స్టార్‌లింక్ దేశంలో గరిష్టంగా 2 మిలియన్ కనెక్షన్‌లను మాత్రమే అందించగలదు.