Amazon Great Indian Festival Sale : వావ్.. ఇది కదా ఆఫర్.. అతి చౌకైన ధరకే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
Amazon Great Indian Festival Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ భారీ తగ్గింపుతో ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Amazon Great Indian Festival Sale
Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 వచ్చే వారమే ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
ఈ పండుగ సీజన్‌లో మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే (Amazon Great Indian Festival Sale) ఇదే బెస్ట్ టైమ్. కొత్త మిడ్-రేంజ్ ఫోన్లలో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ అతి తక్కువ ధరకే లభించనుంది. ఈ పండుగ సేల్ ప్రారంభమైన వెంటనే కొనేసుకోవచ్చు.
ఇతర ఫోన్ల డీల్స్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకు లభించనుంది. ఈ సేల్ సమయంలో అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ తగ్గింపు ధరకే పొందవచ్చు. అయితే, ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ప్రీమియం డిజైన్, ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో అన్ని బ్యాంక్ ఆఫర్లతో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ (Redmi Note 14 Pro Plus) రూ.24,999కి కొనుగోలు చేయొచ్చు. అయితే, ఈ ఆఫర్‌ను పొందాలంటే మీకు ఎస్బీఐ లేదా అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డులు వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు కలిగి ఉండాలి. అప్పుడే తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.
ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆప్షన్లు :
ఈ రెడ్‌మి ఫోన్ కొనుగోలుదారులు ఈఎంఐ ఆప్షన్ల ద్వారా పొందవచ్చు. పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ అసలు ధర రూ.34,999 ఉండగా మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ బెస్ట్ ఆప్షన్. IP66 + IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పవర్‌ఫుల్ 6.67-అంగుళాల 1.5K OLED ప్యానెల్, ఐఫోన్ 17 మాదిరి 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుంది.
బ్యాటరీ బ్యాకప్ కూడా అద్భుతంగా ఉంటుంది. 90W ఛార్జింగ్‌తో భారీ 6,200mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే 20MP ఫ్రంట్ కెమెరా ఉంది.