Amazon Great Indian Festival 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Amazon Great Indian Festival : మీరు శాంసంగ్ అభిమాని అయితే అమెజాన్ సేల్ వరకు ఆగాల్సిందే.. ఈ మడతబెట్టే ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Amazon Great Indian Festival 2025
Amazon Great Indian Festival 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకించి శాంసంగ్ ఫోన్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో లభ్యం కానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా నుంచి ఫోల్డ్ ఫ్లిప్ లైనప్ వరకు అనేక శాంసంగ్ ఫోన్ల (Amazon Great Indian Festival 2025) ధరలు భారీగా తగ్గనున్నాయి. మీరు ఫస్ట్ టైమ్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలని చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అద్భుతమైన డీల్. ఈ సేల్ సీజన్‌లో ఇంత భారీ తగ్గింపు కలిగిన ఫోన్ ఇదే కానుంది. ఇంతకీ ఈ ఆకట్టుకునే మడతబెట్టే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర తగ్గింపు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 అసలు లాంచ్ ధర రూ.1,64,999కు బదులుగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ మార్కెట్లో రూ.1,10,999కు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర తగ్గింపుతో పాటు ప్లాట్‌ఫామ్‌పై బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. ఈ మడతబెట్టే ఫోన్ సిల్వర్ షాడో, నేవీ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో 4nm ప్రాసెస్ ఆధారంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) ఉన్నాయి. 7.6-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరోవైపు, శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 10MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. అదనంగా, ఈ శాంసంగ్ ఫోన్ 4MP అండర్ డిస్‌ప్లే సెన్సార్, 10MP కవర్ సెన్సార్ కూడా కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 4400mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.