Gold Price Today : వార్నీ.. ఊహించని దెబ్బకొట్టిన బంగారం.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్ద్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి.

1/8
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి ధరలు బిగ్ షాకిచ్చాయి. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి.
2/8
అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న ఆర్థిక పరిణామాలు ఈ ధరల పెరుగుదులకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డాలర్ విలువలో వస్తున్న మార్పులు బంగారం మార్కెట్ ను శాసిస్తున్నాయి. పెట్టుబడి దారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంపై ఆస్తి చూపడం వల్ల గిరాకీ పెరిగింది. దీని ప్రభావం నేరుగా మన దేశీయ మార్కెట్లపై పడింది. ఫలితంగా ఒక్కరోజే బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి.
3/8
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,470 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 30డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,772 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
వెండి ధరలో సైతం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరగింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,930 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,100 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,080కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,930కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,100 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,55,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.