HRRL Recruitment
HRRL Job Vacancies : హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్) లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 142 ఇంజినీర్/ ఫైర్ అండ్ సేఫ్టీ/ సీఏ తదితర పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో తప్పనిసరిగా ఇంజినీరింగ్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీ/ఎంబీఏ/మాస్టర్స్ డిగ్రీ/సీఏ/ఐసీఏఐ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష/ షార్ట్‌లిస్టింగ్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.2,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 26, 2023 దరఖాస్తుకు తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hrrl.in/ పరిశీలించగలరు.