CBSE టెన్త్ రిజిల్ట్స్ : ఆర్మీ స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత 

దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు అత్యధిక స్కోరుతో రాణించారు.

  • Publish Date - May 7, 2019 / 07:09 AM IST

దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు అత్యధిక స్కోరుతో రాణించారు.

దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఆఫ్ ఎడ్యుకేషన్ (CBSE) టెన్త్ పరీక్ష ఫలితాలు సోమవారం (మే 6, 2019) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు అత్యధిక స్కోరుతో రాణించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు 499/500 స్కోరుతో టాపర్లుగా నిలిచారు.

జమ్మూకశ్మీర్ లోని ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే ఆర్మీ గుడ్ విల్ స్కూళ్లలో కూడా సీబీఎస్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తుమ స్కోరుతో రాణించారు. ఆర్మీ స్కూళ్లలోని సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆర్మీ స్కూళ్లలో చదివిన రాజోరి జిల్లాకు చెందిన హిట్టాం అయూబ్ సీబీఎస్ఈ ఫలితాల్లో 94.2 శాతంతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇండియన్ ఆర్మీ జమ్ముకశ్మీర్ లో మొత్తం 43 గుడ్ విల్ స్కూళ్లను రన్ చేస్తోంది. సుదూర ప్రాంతాల్లోని స్కూళ్లలో ప్రత్యేకించి మూడు ఆర్మీ స్కూళ్లలో సీబీఎస్ఈ అనుబంధంతో నడుస్తున్నాయి. 1998లో ఇండియన్ ఆర్మీ 4 ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించింది. ఆర్మీ గుడ్ విల్ స్కూళ్ల పేరుతో ఇప్పుడు 43 స్కూళ్లను నార్తరన్ కమాండ్ నడుపుతోంది. సద్భావన ప్రాజెక్ట్ కింద 15 వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది.

ఈ స్కూళ్లలో వెయ్యి మంది టీచర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను సోమవారం మధ్యాహ్నం అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in, cbse.nic.in లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇండియాలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను 4974 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా.. విదేశాల్లో కలిపి మొత్తం 19వేల 298 స్కూళ్లలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను నిర్వహించారు.