ICFRE Recruitment : డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఖాళీల పోస్టుల భర్తీ.. అర్హుల విషయానికి వస్తే..

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ICFRE Recruitment :

ICFRE Recruitment : భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ విశాఖపట్నం, హైదరాబాద్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు ఐఎఫ్ఎస్‌/ఎస్‌ఎఫ్‌ఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన నియమించనున్నారు. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు డెహ్రాడూన్‌, అల్హాబాద్‌, సిమ్లా, రాంచి, కోయింబత్తూర్, విశాఖపట్నం, హైదరాబాద్‌, జోర్హత్‌, మిజోరాం, జబల్‌పూర్‌, ఛింద్వారా, జోధ్‌పూర్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, P.O. న్యూ ఫారెస్ట్, డెహ్రా డన్-24006. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://icfre.gov.in/ పరిశీలించగలరు.