IITmandi Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీకాం, బ్యాచిలర్ డిగ్రీ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధింది ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : October 1, 2022 / 09:35 AM IST
iitmandi
IITmandi Recruitment : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బీకాం, బ్యాచిలర్ డిగ్రీ, ఎంకాం లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధింది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించరాదు. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iitmandi.ac.in/ పరిశీలించగలరు.
