Join Indian Navy : భారత నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ ఐటీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్ధేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

Join Indian Navy : భారత నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Indian Navy Short Service Commission Officer Posts Recruitment

Updated On : October 24, 2022 / 2:36 PM IST

Join Indian Navy : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 217 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అవివాహిత పురుష, మహిళా అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

బ్రాంచి మరియు కేడర్ ల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి జనరల్ సర్వీస్, హైడ్రో కేడర్ 56 పోస్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ 5ఖాళీలు, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 15 ఖాళీలు, పైలట్ 25 ఖాళీలు, లాజిస్టిక్స్ 20 ఖాళీలు, ఎడ్యుకేషన్ 12 పోస్టులు, ఇంజినీరింగ్ జనరల్ సర్వీస్ 25 పోస్టులు, ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ 45 పోస్టులు, నావల్ కన్ స్ట్రక్టర్ 14 ఖాళీలు ఉన్నాయి.

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్ధులు సంబంధిత శాఖలు, కేడర్, స్పెషలైజేషన్ లో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల అధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్ధులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ ఐటీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్ధేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

నెలకు వేతనంగా 56, 100 చెల్లిస్తారు. ఎంపిక విధానానికి సంబంధించి డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్య్వూ , వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండ్ట్స్, దువపత్రాల పరిశీలన అధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబర్ 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.indiannavy.nic.in పరిశీలించగలరు.