ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు

ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినాఝడ్‌ చోంగ్తూ తెలిపారు.

  • Publish Date - December 28, 2019 / 02:40 AM IST

ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినాఝడ్‌ చోంగ్తూ తెలిపారు.

ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టినాఝడ్‌ చోంగ్తూ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి పలు విభాగాల్లో పని చేసేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 27, 2019) కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఐటీడీఏ పరిధిలో కార్యనిర్వహక సిబ్బంది అవసరమని తెలిపారు. పోస్టులు, అర్హత వంటి వివరాలను అభ్యర్థులు http://twd.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను mktgtsgcc@gmail.com మెయిల్‌కు జనవరి 10వ తేదీ లోపు సమర్పించాలని కమిషనర్‌ వెల్లడించారు.