DRDO JOBS : డీఆర్ డీఓ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటుగా గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : June 11, 2022 / 10:47 AM IST
Drdo Hyderabad
DRDO JOBS : భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న హైదరాబాద్ లోని రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలను ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ 2 ఖాళీలు, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ 2 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటుగా గేట్ స్కోర్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే గేట్ మెరిట్ స్కోర్ అధారంగా షార్ట్ లిస్ట్ ఉంటుంది. తరువాత వాక్ ఇన్ ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక చేపడతారు. ఇంటర్వ్యూ ను 5జులై 2022న నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ జరిగే చిరునామా ; డీఎల్ఓఎమ్ ఐ, డీఆర్డీఓ టౌన్ షిప్, కంచన్ బాగ్, హైదరాబాద్ 500058, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.drdo.gov.in/ పరిశీలించగలరు.
